News and Entertainment

ప్రతీ వ్యక్తికి వచ్చే 10కామన్ కలలు ఇవే !




సాధారణంగా ప్రతి మనిషికి వచ్చే 10 కలల, వచ్చే కలను బట్టి ఆ వ్యక్తి ఏవిధంగా ఆలోచిస్తున్నాడో తెలుసుకోవొచ్చు.!?
నిద్రపోతే చాలు మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తుంటుంది. అయితే కలలను గురించి అధ్యయనం చేసే నిపుణులు ఏం చెబుతున్నారంటే ప్రతి మనిషి రాత్రి పూట నిద్రించే సమయంలో దాదాపు 4 నుంచి 5 వరకు భిన్నమైన కలలను కంటాడట. ఒక్కో కల 15 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుందట. అయితే వీటిలో అధిక శాతం వరకు అనేక మందికి గుర్తుండవు. కేవలం కొద్ది మందికి మాత్రమే అవి గుర్తుంటాయి. కానీ కొన్ని రకాల కలలు మాత్రం మనలో అధిక శాతం మందికి సాధారణంగా తరచూ వస్తూనే ఉంటాయి.




నిపుణలు చెబుతున్న ప్రకారం వ్యక్తుల ప్రవర్తనను బట్టి వారికి కలలు వస్తాయట. వారి వ్యక్తిత్వం, నడవడిక ఇత్యాది అంశాల మేళవింపుతో కూడినవై కలలు ఉంటాయి. అయితే ఇదే సమయంలో కలలు కొన్ని విషయాలను కూడా మనకు చెబుతుంటాయి. మనం భయపడుతున్న, నిర్లక్ష్యంగా వదిలేస్తున్న విషయాలను ప్రతిబింబించే విధంగా కలలు వస్తాయి. అసలు మనకు సాధారణంగా తరచూ వచ్చే కలలు ఏమిటి? వాటి గురించిన విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.