News and Entertainment

ఒకే రోజు 14 సినిమాలు రిలీజ్




సినిమా ఇండ‌స్ట్రీలో పెద్ద సినిమాలు లేని స‌మ‌యం చూసుకుని చిన్న సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డం మామూలే. ఇదే త‌ర‌హాలో ఏప్రిల్ 1న ఏకంగా ఒక‌టి, రెండు కాదు.. మొత్తం 14 సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. టాలీవుడ్‌లో సంక్రాంతి తర్వాత నెలన్నర వ్యవధిలో 40కి పైగా చిన్న సినిమాలు రిలీజవడం విశేషం. గత వారం నుంచి వేసవి సినిమాల సందడి మొదలైంది కాబట్టి ఇక చిన్న సినిమాల జోరుకు అడ్డుకట్ట పడినట్లే అనుకుంటుంటే.. మళ్లీ వచ్చేవారం ఒకేసారి సినిమాల‌న్ని ఉప్పెన‌లా వ‌స్తున్నాయి.

నారా రోహిత్-నందిత కాంబినేషన్లో యువ దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన ‘సావిత్రి’ వచ్చే శుక్రవారం రిలీజవుతోంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమా త‌ర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమా ‘అటాక్’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. జనాల దృష్టి ప్రధానంగా ఈ రెండు చిత్రాల మీదే ఉంది. దీంతో పాటు శర్వానంద్-నిత్యామీనన్‌ల ‘రాజాధిరాజా’ కూడా ఏప్రిల్ 1నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చేరన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇది ఓ తమిళ సినిమాకు అనువాదం. ఆ చిత్రం తమిళంలో డీవీడీల రూపంలో రిలీజ‌వ్వ‌డం విశేషం.



సెల్వ రాఘవన్ కథతో అతడి భార్య గీతాంజలి రూపొందించిన తమిళ అనువాదం ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ కూడా అదే రోజు రిలీజువుతోంది. ఈ నాలుగూ కాకుండా పిడుగు, 7 టు 4, మాస్ (ధనుష్-కాజల్‌ల ‘మారి’కి అనువాదం), అప్పుడలా ఇప్పుడిలా, ఆమె ఎవరు, భరతన్న, ఓ మల్లి, రహదారి, 24 అవర్స్, ధనాధన్.. అనే సినిమాలు కూడా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఐతే ఈ సినిమాలపై ప్ర‌చారం, ఆక‌ర్ష‌ణ కూడా జనాలకు పెద్దగా లేద‌నే చెప్పాలి. కొన్ని సినిమాల పేర్లు జ‌నాల‌కు కూడా తెలియ‌వు. ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలున్న ఎటాక్‌, సావిత్రి సినిమాల‌లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.