News and Entertainment

అమ్మ చెప్పిన 8 అబద్దాలు…. ప్రతి ఒక్కరికీ అనుభవాలే!


అమ్మ చెప్పిన అబద్ధాలు. అమ్మలెప్పుడూ నిజం చెప్పరు. వాళ్లను మించిన 
అబద్ధాలకోర్లు ఈ ఆకాశం కింద లేరు. కావాలంటే చదవండిది.ఈ కధ నా చిన్నప్పుడు మొదలైంది. నేను చాలా పేదరికంలో పుట్టాను. పూటపూటకూ తిండి వెతుక్కునేంత పేదరికం. ఎప్పుడైనా ఇంట్లో అన్నం ఉంటే మా అమ్మ తను తినాల్సిన అన్నం కూడా నాకే పెట్టేది. నా గిన్నెలో అన్నం పెడుతూ -నువ్వు తిను నాన్నా నాకిప్పుడు ఆకలిగా లేదులే-అన్నది.

:అది అమ్మ చెప్పిన మొదటి అబద్ధం.





అప్పుడప్పుడూ మా అమ్మ ఊరి దగ్గరిలోని వాగులో చేపలు పట్టేది. ఎదిగే బిడ్డకు కాస్తంత పోషకాహారం పెట్టాలని ఆమె ఆశ. కొనలేదు కాబట్టి వాగు దగ్గర గంటలు గంటలు పడిగాపులు పడేది. ఒకటో రెండో చిన్న చేపలు దొరికేవి. అలాంటపుడు నాకు వండిపెట్టి నేను తిన్నాక మిగిలిన చేపముక్కకు ఏమైనా కండ ఉంటే దాన్ని అమ్మ తినేది. ఊహ తెలిశాక అది చూసి నాకు కష్టమనిపించేది. నేను నా గిన్నెలోంచి ఓ చేపముక్క అమ్మకు వేయబోతే చేయి అడ్డంగా పెట్టి వారిస్తూ-వద్దు నాన్నా నాకసలు చేపల వాసనే పడదు-అన్నది.

:అది అమ్మ చెప్పిన రెండో అబద్ధం.