News and Entertainment

సర్దార్ కు షాక్ ఇచ్చిన అల్లుఅరవింద్

అల్లు అరవింద్ వ్యూహాత్మక ఎత్తుగడల గురించి తెలియని వారుండరు. సినిమా రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఆ నలుగురులో ఒకరుగా పేరున్న అరవింద్ ఏ విషయంలోనూ ఖంగారు పడకుండా చాల జాగ్రత్తగా ప్లాన్ చేస్తాడు అని అంటారు. ఈమధ్య కాలంలో తన గీత ఆర్ట్స్ పై భారీ సినిమాలు తీయడం తగ్గించి వేసిన అరవింద్ ఈ సారి ఏకంగా తన కొడుకు అల్లుఅర్జున్ ను హీరోగా పెట్టి తీస్తున్న ‘సరైనోడు’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

వచ్చే నెల ఏప్రియల్ 22న విడుదల కాబోతున్న ఈసినిమా ఆడియోను ఫంక్షన్ చేయకుండా డైరెక్ట్ గా ఏప్రియల్ 1న విడుదల చేయడం వెనుక ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మెగా అభిమానులలో అదేవిధంగా మీడియాలో ఎక్కడ చూసినా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వార్తలే ప్రముఖంగా కనిపిస్తున్న నేపధ్యంలో ఈ హడావిడి మధ్య ‘సరైనోడు’ ఆడియో ఫంక్షన్ ను నిర్వహించినా డానికి సరైన గుర్తింపు రాదు అన్న ఉద్దేశ్యంతో అరవింద్ ‘సరైనోడు’ ఆడియో ఫంక్షన్ ను క్యాన్సిల్ చేసినట్లు టాక్. 
‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఏప్రియల్ 8న విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా ఫలితం పూర్తిగా తెలిసిన తరువాత ‘సరైనోడు’ ఆడియో సక్సస్ మీట్ ను ఏప్రియల్ 10, 12 తారీఖుల మధ్య నిర్వహిస్తే అప్పటికి ‘సర్దార్’ ఫలితం పూర్తిగా తేలిపోతుంది కాబట్టి ఆ సినిమా రిజల్ట్ బట్టి ‘సరైనోడు’ పబ్లిసిటీ ఎత్తుగడలను మార్చాలని అరవింద్ ఆలోచన అని వార్తలు వస్తున్నాయి.అన్నీ కుదిరితే వైజాగ్ లో జరగబోయే ‘సరైనోడు’ ఆడియో సక్సస్ మీట్ కు పవన్ ను అతిధిగా పిలవడం ద్వారా ‘సరైనోడు’ మూవీ పబ్లిసిటీకి భారీ స్కెచ్ వేయాలని అరవింద్ ఆలోచన అని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమా సెకండ్ ఆఫ్ విషయమై కొన్ని నెగిటివ్ వార్తలు ప్రచారంలో ఉన్న నేపధ్యంలో ఆ నెగిటివ్ వార్తలకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ద్వారా చెక్ పెట్టాలని అరవింద్ ఎత్తగడ అని అంటారు..