News and Entertainment

అరటి పండు కన్నా, తొక్కే మేలట





మీకు అరటిపళ్ళు తినడమంటే చాలా ఇష్టమా? ఎస్ అని సమాధానం ఇచ్చే వారు కొందరైతే, నాకు ఇష్టంలేదు అని మరికొందరు చెబుతారు. అయితే మరి అరటి తొక్కను ఎంతమంది ఇష్టంగా తీసుకుంటారు అని అడిగితే, మరీ టూమచ్ చేస్తున్నాడని అనుకుంటారేమో, ఆ అనుమానం వస్తే మీరు తొక్కపై కాలు వేసినట్లే. ఎందుకంటే అరటితొక్కను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. అవునా అంటూ ముక్కునవేలేసుకుంటారు. అరటితొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి.

అరటితొక్క మానసికస్థితిని మార్చడంలో సహాయపడుతుంది:
డిప్రెషన్, డల్ గా ఉండటం కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆనందపడటం ప్రస్తుతం సగటు మనిషి జీవితంలో సాధారణం అయింది. ఇందులో సేరోటినీన్ ఉండటం వలన అది తీసుకున్నప్పుడు శక్తివంతంగా, సంతోషంగా ఉండే సామర్థ్యాన్ని కలిగిస్తుంది.



గుండెకు అండగా:
అరటికన్నా అరటితొక్కలో ఎక్కువగా జీర్ణం చేసుకునే పీచు పదార్థాలు ఉంటాయి. అందువల్ల కొవ్వుపదార్థాల స్థాయి తగ్గి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయపడుతుంది.


బరువు, స్లిమ్, ఆరోగ్యంగా ఉండేలా:
అరటితొక్కలో పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా బరువు ఒకే విధంగా ఉంటూ, ఆరోగ్యంగా స్లిమ్ గా, ఫిట్ గా ఉంటారు.