News and Entertainment

బ్రహ్మోత్సవం సీన్లు వీడియో లీక్..!



తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు గత సంవత్సరం విడుదలైన ‘శ్రీమంతుడు’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అప్పటి వరకు 50 కోట్ల మార్కెట్ లో ఉన్న మహేష్ ఒక్కసారే వందకోట్లకు దాటాడు. ఈ చిత్రం సోషల్ మెసేజ్ తో ఎంతో మంది సెలబ్రెటీలను కదిలించింది. ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. శ్రీమంతుడు విజయంతో మంచి ఊపు మీదు ఉన్న మహేష్ బాబు తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్ రిలీజ్ అయ్యింది. షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. తాజాగా ఒక సన్నివేశానికి సంబంధించిన వీడియో లీక్ అయ్యింది..ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. ఇక ఇలాంటి లీక్ లు ఈ మద్య బాగానే జరుగుతున్నాయి. ఆ మద్య రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ కి సంబంధించి పోరాట సన్నివేశాలు లీక్ అయ్యాయి అయితే వెంటనే మేల్కొని చిత్ర యూనిట్ నెట్ లోంచి ఆ సన్నివేశాలు తీయించారు.




ఏది ఏమైనా చిత్రాలకు సంబంధించి ఇలాంటి సన్నివేశాలు..ఫోటోలో ముందుగానే రివీల్ కావడం వాటిపై ఎక్కడలేని హైప్ క్రియేట్ కావడం తెలుగు ఇండస్ట్రీలో కామన్ అయ్యింది. ఏది ఏమైనా బ్రహ్మోత్సవం చిత్రంలో ముగ్గురు భామలతో మహేష్ చేసే హంగామా ఏలా ఉండబోతుందో త్వరలో తెలియబోతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది. 

Watch Here : బ్రహ్మోత్సవం వీడియో(లీక్డ్)