News and Entertainment

డేటింగ్ లో అమ్మాయిలు గమనించే ముఖ్య విషయాలు-1


డేట్ కోసం మీరు భయటకు వెళ్తున్నారంటే ఆ సమయం మీరు సంతోషంగా గడుపవచ్చులేదా మీరు భంగపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీతో వచ్చే స్త్రీలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కనుక తప్పక మీరు ఎల్లప్పుడూ వారికి సంరక్షకుణిగా నడచుకోవాలి. అమ్మాయిలు మీరు ఊహించిన దానికంటేఅన్ని కోణాలలో ఎక్కువగానే వారు మిమ్మల్ని గమనిస్తూవుంటారు.

వయస్సుపై గల ఒక పాత సామెత, “మీపై  మొదటి ఏర్పడిన అభిప్రాయమే చివరది" (ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద లాస్ట్) అనే అర్ధం చేసుకున్నట్లయితే ఇది చాలా నిజం అని తెలుస్తుంది. మీరు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోనట్లయితే, లేదా దానిని పరీక్షించాలి అనుకుంటే, బహుశా ఈ సమయం సరైనదయై ఉండవచ్చు. ఒక అమ్మాయి మొదటి సారి మిమ్మల్ని కలిసినపుడే మీ పట్ల ఆకర్షితురాలు అయినట్లయితే, ఆమెతో సంబంధం కొనసాగించడానికి మీకు చాలా అవకాశాలుంటాయని మీరు అర్ధం చేసుకోవచ్చు. డేట్ సమయంలో అమ్మాయిలు ఒక అబ్బాయి యొక్క అన్ని వివరాలు గమనిస్తూంటారు. కాబట్టి ఆ సమయంలో మీరు ఆమెను ఆకట్టుకున్నట్లయితే మళ్ళి మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. డేట్ లో అమ్మాయి ఎక్కువగా ఏమి గమనిస్తారో పరిశీలిద్దాం.


మీరేం ధరించారని

డేట్ లో ఒక అమ్మాయి గమనించే మొదటి అంశం, మీరు ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలి అంటే సాధారణమైన, చక్కగా మరియు సొగసైన దుస్తులకి బదులుగా మరీ ఎక్కువగా ఆకర్షించే దుస్తులే ధరించాలి అని అర్ధం చేసుకోకూడదు. అమ్మాయిలు ఏ అబ్బాయిలు అయితే సొగసైన దుస్తులు ధరించి బాగా కన్పిస్తూ ఉంటారో వారి పట్లే ఎక్కువగా ఆకర్షితులవుతారు అని స్పష్టంగా అర్ధమవుతుంది. మీపై పడిన మొదటి అభిప్రాయం చాలా ముఖ్యమైనది. అయితే ఇది ఒక నిస్సారమైన ఒప్పందంలా అన్పిస్తున్నా, ఒక వ్యక్తి బాహ్య సౌందర్యం కన్నా అంతర్గత సౌందర్యం ముఖ్యమైనది, కానీ స్త్రీ పురుషులలో ఖచ్చితంగా బాహ్య సౌందర్యం కూడా ఒక ముఖ్యమైన కారకంగా చెప్పవచ్చు మరియు ఈ విషయాన్ని మనం విస్మరించలేము కూడా! అందువలన, ఒక మహిళను ప్రభావితం చేసే క్రమంలో, ఒక పురుషుడు తప్పక మంచి దుస్తులు ధరించి అందంగా తయారు కావాల్సిందే. ఇప్పటి నుండి మీరు వెళ్ళే ప్రతి డేట్ లో మీరు ఏమి ధరించాలో ముందే ఆలోచించుకోండి, కానీ అది అతిగా కాకుండా వహించండి.


మీ ఆహార్యం ఎలా ఉంది

ప్రతి మహిళ తుచ్చమైన పురుషుని గురించి కాకుండా బాగా విజయాలు సాధించిన పురుషుని గురించే చూస్తుంది కాబట్టి మీకు మంచి ఆహార్యం ఉండడం అతి ముఖ్యమైన విషయం. ఆహార్యంగా తయారవడం అంటే మీ శరీర జుట్టును వ్యక్స్ ద్వారా తీసేసుకోవడం, మీ గడ్డాన్నిగీసుకోవడం, తల శిరోజాలను చక్కగా దువ్వుకోవడం, వేలి గోర్లను తీసుకోవడం వంటి విషయాలు కానే కాదు. ఒక అమ్మాయి మీ హాస్య భావానికి ఆకర్షితురాలు అయినప్పట్టికీ, మీరు అపరిశుభ్ర రూపాన్ని కలిగి ఉన్నట్లయితే, ఆమె నిజంగా మీతో పాటు వెళ్ళడానికి ఇష్టపడదు. స్త్రీలు మిమ్మల్ని గమనిస్తారు కాబట్టి మీకు మీరు సిద్దంగా ఉన్నారో నిర్దారించుకోండి. ఈ విషయాలతో పాటు మీ వ్యక్తిత్త్వాన్ని జోడించినట్లయితే మీరు వారికి మరింత కావాల్సిన విధంగా ఆకర్షణీయంగా మరియు మర్యాదస్థులుగా తయారు చేసుకోవచ్చు. ఆహార్యం అనేది పురుషులకు సంబంధించిన విషయం, దీని బట్టి మీరు అర్ధం చేసుకోవలసినది మీకోసం మరియు ఆమె కళ్ళలో బంధి అవడం కోసం అయినా మీకు మీరే సాధన చేసుకొని సంసిద్దంగా తయారుకావాలి.
      Prev                                                                       Next