News and Entertainment

డేటింగ్ లో అమ్మాయిలు గమనించే ముఖ్య విషయాలు-2


మీరు ఎంత విశ్వాసంగా ఉన్నారు

దీనిని బట్టి మనం అర్ధం చేసుకునేది ఏంటి అంటే, కనీసం ఆమె కళ్ళకు కనిపించేంత వరకు అయిన మీ పూర్తి వ్యక్తిత్త్వం ఎలాంటి లోపం లేనిదై ఉండాలి. మీ యొక్క విశ్వాసం, శరీర భాషలో, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే విధానంలో, ఏదైన ఒక విషయంలోకి మీరు కలుగచేసుకొని మాట్లాడే విధానంలో, ఆమెతో సంభాషించే విధానంలో, డేట్ కి ఆమెని తీసుకెళ్ళిన ప్రదేశం మరియు మొదలైన విషయాలలో తెలిసిపోతుంది. కొన్నిసార్లు, కొందరు వ్యక్తులు మీరు ఏ విధంగా కూర్చొని మాట్లాడుతున్నరో కేవలం ఆ ఒక్క  విధానాన్నే గమనించి మీరు ఏ స్థాయిలో విశ్వాసం కలిగి ఉన్నారో పసిగట్టేస్తారు.  విశ్వాసం అనేది ప్రతి పురుషుడిలో ఉండాల్సిన ఒక ఖచ్చితమైన గుణం మరియు ప్రతి ఒక మహిళా ఒక పురుషునిలో ఇదే వెదుకుతుంది, మరియు మీలో విశ్వాసం లేనట్లయితే మీరు ఒక మంచి చిన్న పిల్లాడిలా కన్పిస్తారు. పిరికివానిలా ప్రవర్తించడం వలన అది ఎపుడు, ఎవరికీ ఉపయోగపడదు మరియు అది మీకు కూడా ఏ విధంగా ఉపయోగపడదు అని మేము మీకు నమ్మకంగా చెప్పగలం.


గలగల మాట్లాడటం ఒక బహుమతి

ఒక అమ్మాయికి ఎపుడు బాగా మాట్లాడటానికి ఒక పురుషుడు; ఆ తర్వాత తనతో బాగా మాట్లాడే పురుషుడు కావాలని కోరుకుంటుంది. ఇది అతని పెంపకానికి మరియు విద్యకి ప్రతిబింబం వంటిది. ఏ పురుషుడైతే బాగా మాట్లాడగలుగుతాడో, అ పురుషుడిని ఆసక్తికరమైన, ప్రపంచాన్ని గ్రహించిన మనిషిగా భావించవచ్చు. ఒకవేళ మీకు గలగలమని మాట్లాడటం రానట్లయితే, కనీసం మీరు అర్దవంతంగా అయినా మాట్లాడేట్లు ప్రయత్నించాలి. ఏదైనా వస్తువులకు సంబంధించి విషయాలు మాట్లాడుకునేపుడు, తాజా ఐ ఫోన్ వంటివి కాకుండా, మీరు మరీ మిడి మిడి జ్ఞానంతో లేదా బుద్ధిహీనత లేకుండా మాట్లాడాలి, ఒకవేళ అలా మాట్లాడితే ఆ వస్తువు పట్ల మీకు ఉన్నఅవగాహనాలోపం మరియు జ్ఞానవిహీనత ప్రతిబింబిస్తుంది.
      Prev                                                                       Next