News and Entertainment

మొగుడ్ని తిడుతున్నారా..ఐతే ఇక విడాకులే !



భర్తను గున్న ఏనుగు, చేతగానివాడు అంటూ తిట్టడం అతని ఉత్సాహాన్ని దెబ్బతీయడం, ఆత్మగౌరవాన్ని భంగపరచడమే అవుతుంది. ఈ కారణంతో కూడా భార్య నుంచి భర్త విడాకులు తీసుకోవచ్చు. ఇలా తిట్టడం వైవాహిక బంధాన్ని దెబ్బతీస్తుందని, కాబట్టి ఈ కారణంతో విడాకులు తీసుకోవచ్చునని ఢిల్లీ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ కేసులో కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పిచ్చింది.



లావుగా ఉండటం, భార్య లైంగిక వాంఛలను సంతృప్తిపరచకపోవడం వల్ల ఆమె తనను క్రూరంగా హింసిస్తోందంటూ ఓ వ్యక్తి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అతనికి 2012లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసులో విడాకులు ఇవ్వడం సబబేనని ఉన్నత న్యాయస్థానం ఫ్యామిలీ కోర్టును సమర్థించింది.



‘ఏనుగు, గున్న ఏనుగు, మోటా ఎలిఫెంట్‌ అన్న తిట్లు, దూషణలతో వాది తన భర్త ఆత్మగౌరవాన్ని, ఉత్సాహాన్ని దెబ్బతీసేలా వ్యవహరించింది’ అని ఈ సందర్భంగా జస్టిస్ విపిన్ సంఘీ వ్యాఖ్యానించారు. ఈ కేసులో భార్య తాను త‌న భ‌ర్త ప‌ట్ల ఎప్పుడు క్రూరంగా ప్ర‌వ‌ర్తించానో తేదీలు, టైం చెప్ప‌లేద‌ని ఆమె చెప్పినా వైవాహిక బంధంలో ఉన్న వారు ఏ రోజు ఏ నేరం జరిగింది. ఏ తప్పిదం జరిగింది అంటూ చిట్టాపద్దును ప్రత్యేకంగా రాయరని హైకోర్టు పేర్కొంది.