News and Entertainment

అమ్మాయిల కళ్ళు చెప్పే రహస్యాలు ఇవే





నీ చేప కళ్లు, చేప కళ్లు  గిచ్చుతున్నవే, నీ కోల కళ్లు కోల కళ్లు గిల్లుతున్నవే….ఇది ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ పాట….అయితే లిరిక్స్ లోపలికి వేళ్లే ప్రయత్నం కాదు కానీ అ కేవలం కళ్లు, కనుబొమ్మలను పరిశీలించి అవతలి వారు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయవచ్చట. అందమైన ఆ కళ్లలోకి చూస్తే ఇట్టే వారి మనస్తత్వాన్ని చెప్పోయొచ్చట..అంతేకదా మరి..ఆ కళ్లు వ్యక్తిత్వానికి నకళ్లు.!!


పిల్లి కళ్ల మాదిరిగా ఉంటే:



చిత్రంలో చూపిన విధంగా కళ్లు కలిగి ఉంటే వారు ఇతరులను ఎక్కువగా ప్రభావితం చేస్తారట. ప్రధానంగా మహిళలు ఇలాంటి కళ్లను కలిగి ఉంటే వారు మంచి మాటకారులుగా, స్వార్థపరులుగా ఉంటారట.

కలువపువ్వుల్లాంటి  కళ్లు: 


కలువ పూల లాంటి కళ్లను కలిగిన పురుషులు సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారట. వీరు ప్రతిభావంతులట. ఎవరినైనా సులభంగా ఆకట్టుకుంటారట. అదే మహిళలైతే ఏదైనా సాధించే తత్వం కలిగి ఉంటారట. వారు మంచి మాటకారులుగా కూడా ఉంటారట.




డో కళ్లు 


ఇలాంటి కళ్లను కలిగిన వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూల్‌గా, కామ్‌గా ఉంటారట. సాధారణంగా తమ భావాలను బయట పెట్టరట. మంచి హృదయం కలిగి ఉంటారట. ఇతరులకు ఎల్లప్పుడూ సహాయం అందించే మనస్తత్వం కలిగి ఉంటారట. కొత్త వ్యక్తులను కూడా కలుపుకుని పోతారట.