News and Entertainment

ఫుడ్ కి సెక్స్ కి మద్య గ్యాప్ ఎంత ఉండాలి?
జీవితంలో శృంగారం చాలా ముఖ్య‌మైన ఘ‌ట్టం.. మ‌నిషికి ఆక‌లి, ద‌ప్పిక‌, నిద్ర ఎంత అవ‌స‌ర‌మో శృంగారం కూడా అంతే అవ‌స‌రం. అంత‌టి ప్రాధాన్యం గ‌ల శృంగారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. రాత్రి భోజ‌నం చేసిన రెండు గంట‌ల త‌రువాత శృంగారంలో పాల్గొన‌డం మంచిద‌ట‌. నిత్యం ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో సెక్స్ చేస్తే ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గి ప్ర‌శాంత‌మైన జీవితం గ‌డ‌ప‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కూడా సెక్సాల‌జిస్టులు చెబుతున్నారు. 

చాలామంది శృంగారానికి సరైన సమయం ఏది ? అని అడిగితే రాత్రి భోజనం తర్వాత, నిద్రకు ఉపక్రమించే ముందు అని చెబుతారు. కానీ, భోజనం చేసిన వెంటనే సెక్స్‌లో పాల్గొనకూడదట. రెండు గంట‌ల త‌రువాతే శృంగారంలో పాల్గొనాల‌ని సెక్సాల‌జిస్టులు చెపుతున్నారు.సాధారణంగా మనం ఏ పని చేయడానికైనా రక్త ప్రసరణ అవసరం. మన శరీరంలో ఏ భాగంతో పనిచేస్తున్నామో, ఆ సమయంలో అక్కడకు రక్త ప్రసరణ అధికంగా ఉంటుంది. ఉదాహరణకు మనం నడుస్తున్నప్పుడు మన కాళ్లకు రక్తప్రసరణ అధికంగా ఉంటుంది. కాబట్టి మనం భోజనం చేసిన వెంటనే జీర్ణాశయం పని ప్రారంభిస్తుంది కాబట్టి అక్కడకు రక్త ప్రసరణ అధికంగా ఉంటుంది. అయితే ఆ సమయంలో సెక్స్‌లో పాల్గొంటే రక్త ప్రసరణ జీర్ణాశయానికి కాకుండా జననాంగాలకు జరుగుతుంది. దీంతో జీర్ణ ప్రక్రియ ఆలస్యమ‌వుతుంది. మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలవడానికి రెండు గంటల సమయం పడుతుంది కాబట్టి.. అప్పటివరకు శృంగారంలో పాల్గొనడం మంచిది కాదట. సో.. భోజ‌నం చేసిన రెండు గంట‌ల త‌రువాత శృంగారంలో పాల్గొన‌డం మంచిద‌ట‌.. సెక్స్ విష‌యం పక్క‌న పెడితే మంచం మీద చేరే సమయానికి రెండు గంటల ముందే భోజనం చేయడం ఉత్త‌మం