News and Entertainment

కీలెరిగిన మాంత్రికుడు - PAGE-1


ఈ మధ్య విజయ్ మాల్యా ఆర్థికమయిన అవినీతి మీద ఛానళ్లు, పత్రికలు హోరు పెడుతున్నాయి. కోట్ల రూపాయలు బ్యాంకులకూ, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సిబ్బందికీ ఎగవేసిన కథలు పుంఖానుపుంఖాలుగా వెలుగులోకి వస్తున్నాయి. తీరా విజయ్ మాల్యాను ఈ దేశం విడిచిపోవడానికి చక్కగా  అవకాశం కల్పించాక- దొంగలు పడిన ఆరు నెలలకి ఈ బ్యాంకులు సుప్రీం కోర్టుకెక్కాయని చానళ్లు చెబుతున్నాయి. ‘అవినీతి’కి అంతులేని గ్లామర్ ఉంది. ఈ దేశం వీరప్పన్ గురించి మాట్లాడుకున్నంత రుచిగా పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి గురించి మాట్టాడుకుని ఉండదు.

ఇన్ని రోజులు చానళ్లలో మాట్లాడుతున్నవారూ, ప్రభుత్వ ప్రతినిధులూ - సర్వే సర్వత్రా విజయ్ మాల్యాకు అధికార, బ్యాంకు యంత్రాంగం నుంచి అమోఘమైన సహకారం లభించిందనేవారే కానీ ఏ ఒక్కరూ కారణం చెప్పలేదు. నిజానికి చెప్పలేరు. ఆయా కీలక స్థానాలలో ఉన్న అధికారులు, బ్యాంకు ఆఫీసర్లను కూడగట్టుకోవడానికి శృంగారరాయుడు మాల్యాగారి దగ్గర ఎన్నో దగ్గర తోవలున్నాయి. 9000 కోట్ల పై చిలుకు మాల్యా అరాచకానికి పరోక్షంగా తోడ్పడిన- షరతుల్నీ, పద్ధతుల్నీ, రూల్సునీ తుంగలోకి తొక్కి - నిన్న మొన్నటిదాకా షష్టిపూర్తిని కూడా కోట్ల ఖర్చుతో జరుపుకున్న మాల్యాకు సహాయ పడడానికి వెనుక గల రహస్యం ఏమిటి?   *PAGE-1  *PAGE-2  *PAGE-3