News and Entertainment

కీలెరిగిన మాంత్రికుడు - PAGE-3


మొదటి నుంచీ ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్’గా రొమాంటిక్ జీవనాన్ని కెమేరాల ముందు ఆవిష్కరించే శృంగార వ్యాపారి - ఆ శృంగారాన్ని ‘ఎర’గా చేయగలిగితే వ్యాపారానికి ఎల్లలు చెరిగిపోతాయని ఎరిగి, చెరిపేసిన కథని కాస్త ఆలస్యంగా దేశం వింటోంది. ఆయా దశలలో పెద్దల చీకటి కథల్లో అసలు రహస్యం ఉంది. కాని అక్కడంతా చీకటి. కన్నుపొడుచుకున్నా వినిపించడమే కానీ ఏమీ కనిపించదు.

నా మట్టుకు విజయ్ మాల్యా కీలెరిగిన మాంత్రికుడు. ఈ దేశానికి విస్కీ మత్తునీ, గుర్రాల పందాలనీ, కారు రేసుల్నీ , క్రికెట్ ఆటల జూదాన్నీ పంచిన తెలివైన వ్యాపారి - కీలక స్థానాలలో ఉన్న వ్యక్తుల బలహీనతలని - ఏ మనిషినయినా తల్లకిందులు చేయగల ‘ఆకర్షణ’ని పంచడాన్ని ప్రారంభిస్తే దేవుడు కూడా ఆ ఉచ్చు నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే దేవుడు సాక్షాత్తు మోహినీ అవతారంలో ఆ పని చేశాడు కనుక. అయితే ఆనాడు ఆకర్షితులని రాక్షసులన్నాం. ఇప్పుడు చట్టాన్ని అటకెక్కించిన ‘అధికార, బ్యాంకింగు యంత్రాంగం’ అనుకుంటే మర్యాదగా ఉంటుంది.  *PAGE-1  *PAGE-2  *PAGE-3