News and Entertainment

లక్ష్మీ రాయ్ ఇంత హాటా?




తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు మెరుపుతీగలా కనిపిస్తూ తన అందాలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న అందాలభామ లక్ష్మీరాయ్. ఆ మద్య లారెన్స్ తో కాంచన చిత్రం, రవితేజతో బలుపు చిత్రంలో ఐటమ్ సాంగ్ లో కనిపించింది. తాజాగా ఈ అమ్మడు పవన్ కళ్యాన్ నటిస్తున్న ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో కనిపించి మురిపించ బోతుంది. తాజాగా ‘జూలీ-2' పేరుతో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ద్వారా సౌత్ బ్యూటీ లక్ష్మీరాయ్ హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ అమ్మడు తన అందాలు విపరీతంగా ప్రదర్శించాల్సి వస్తుంది..ఎందుకంటే ఇప్పుడు అక్కడ అడల్ట్ కాంటెంట్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది.


తన సెక్సీ అందచందాలతో హాట్ బేబీగా పేరు తెచ్చుకున్న లక్ష్మీరాయ్ రెండు ఆకులు ఎక్కువే చదివినట్లుంది..తన అందాల ప్రదర్శనతో అప్పుడే జనాలకు కిక్కిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయనుంది. ఇటీవల విడుదలైన జూలీ-2 చిత్రానికి సంబంధించిన ఫోటోలు చూస్తుంటే లక్ష్మీరాయ్ తన అందాల ప్రదర్శన ఏ రేంజ్ లో ప్రదర్శించింతో అర్థమవుతుంది.  సౌత్ లో ఉన్నపుడు ఈ రేంజిలో ఎప్పుడూ చూపెట్టలేదేం? అంటూ ప్రశ్నిస్తున్నారు.


ఈ సినిమా రిలీజ్ కోసం ఆశగా ఎదరు చూస్తున్నారు. 'జూలీ 2' చిత్రానికి దీపక్. ఎస్ శివదాసాని దర్శకత్వం వహిస్తున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ చిత్రం కోసం ఈ అమ్మడు ఏకంగా పదిహేను కిలోలు తగ్గి చాలా స్లిమ్ గా తయారైందట..ఏది ఏమైనా లక్ష్మీరాయ్ ఈ దెబ్బతో బాలీవుడ్ లో జెండా పాతుతుందా అని అనుకుంటున్నారు అభిమానులు.