News and Entertainment

‘ఫేస్ బుక్’ లో భార్యను అమ్మకానికి పెట్టిన భర్త.

Add caption

పేస్ బుక్ కాస్త యాడ్ ఏజన్సీ గా మారుతుందా అంటే అవుననే అనిపిస్తుంది..తాజాగా పేస్ బుక్ లో భార్యనే అమ్మకానికి పెట్టి సంచలనం సృష్టించాడు ఓ భర్త…ఆ వివరాలు ఏంటో మీరే చూడండి..
మధ్యప్రదేశ్ లోని ఖార్గోనే జిల్లాలో శభమ్ నగర్ లో నివాసం ఉంటున్న దిలీప్ అనే వ్యక్తి కట్టుకున్న భార్యనే ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టి కలకలం సృష్టించాడు. అది కూడా మామూలుగా కాకుండా ఏకంగా తన భార్య, కుమార్తె ఫోటోను లక్ష రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు..
ఫేస్ బుక్ లో దిలీప్ ప్రకటనను చూసిన కొంతమంది అతడిని సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట నుండి చివరకు పోలీసుల వరకు వెళ్ళడంతో దిలీప్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.