News and Entertainment

లెప్ట్ హ్యాండర్స్( ఎడమచేతి వాటం) గా ఎందుకు పుడతారు? వారి స్పెషాలిటీస్ ఏంటి??


ప్రపంచ జనాభాలో ఐదు నుంచి 25 శాతం మందికి ఎడమ చేతి వాటం ఉంటుంది. మనదేశంలో లెఫ్ట్ హ్యాండ్  వారి సంఖ్య100లో సగటున ఆరు నుంచి పది మధ్య ఉందట..ఈ లెఫ్ట్ హ్యాండర్స్ లో మగవారే అధికమట. అయితే చాలా మందికి లెఫ్ట్ హ్యాడర్స్ మీద చిన్నచూపు ఉంటుంది. అదేదో వైకల్యంలాగా చూస్తుంటారు. కానీ రైట్ హ్యాండర్స్ కంటే కూడా లెఫ్ట్ హ్యండర్స్..  తమ రంగంలో రయ్ న దూసుకుపోతారట. సైకాలజీ ప్రకారం ఎడమచేతి వాటం వారి ప్రత్యేకతలు ఇక్కడ ఇవ్వడమైనది. లెఫ్ట్ హ్యాండర్స్ గా పుట్టకను  ప్రభావితం చేసే కారణాలేంటీ?
లెప్ట్ హ్యాండర్స్ గుణాలు: 

1. బయటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడరు…ఇంట్లోనే ఎక్కువగా ఉండడానికి ప్రయత్నిస్తారు. 
తల్లితో ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది.


2.  ఆల్కాహాల్ ప్రియులు….అందగాళ్ళు… బాడీ ఫిట్ నెస్ మీద అధిక శ్రద్ద చూపుతారు.
3) కాస్తంత కోపం ఎక్కువ ( ఇంట్లో వారిపై, సన్నిహితులపై) …ప్రతి చిన్న విషయానికి అరుస్తుంటారు, కానీ పిరికి మనస్తత్వం కలవారు.
4) ఆటలపై ఆసక్తి ఎక్కువ.. ఆర్టిస్ట్ లుగా త్వరగా ఎదుగుతారు.
5) మాటతీరు డిఫరెంట్ గా ఉంటుంది. భాషా నైపుణ్యం అంతగా ఉండదు.
6) తెలివేటలు ఎక్కువ:  మెదడులోని కుడి, ఎడమ అర్ధభాగాలను అనుసంధానం చేసే ‘కార్పస్‌ కొలోజమ్‌’ పురచేతివాటం గల వారిలో పెద్దగా ఉంటుంది. అందువల్ల మెదడు కుడి, ఎడమ భాగాల మధ్య సమన్వయం మరింత చురుగ్గా, సమర్థవంతంగా ఉంటుంది. అందువల్లే మాట్లాడే శక్తి, వేగం, సామర్ధ్యం, అర్థం చేసుకోగల శక్తిసామర్థ్యాలు, భావప్రకటనలో స్పష్టత వీరిలో బాగుంటాయి. వీరికి ఐక్యూ ఎక్కువ.
7) ఇంట్లో మద్య, లేదా చివరి సంతానమే ఎక్కువగా లెఫ్ట్ హ్యాండర్స్ గా ఉంటారు.

లెప్ట్ హ్యండర్స్ గా పుట్టడానికి కారణాలు- కొన్ని థియరీలు:
  1. Warrior and his shield theory:
ఈ థియరీ ప్రకారం సైనికుడు యుద్దం చేసే సమయాల్లో ఎడమచేతితో డాలును పట్టుకొని, కుడి చేత్తో కత్తిని పట్టుకొని యుద్దం చేస్తాడు. దీని ప్రకారం చాలా వరకు ఎడమచేతి ఉపయోగం జరుగుతుంది కాబట్టి సైనికుల సంతానం ఎక్కువగా లెఫ్ట్ హ్యాండర్స్ గా పుడతారు.
2. Birth stress theory
కాన్పు సమయంలో తల్లిపై ఎక్కువగా స్ట్రెస్ పడడం వల్ల పుట్టే బిడ్డ లెఫ్ట్ హ్యాండర్ గా పుడతాడు. మెదడు రెండు అర్థ భాగాలుగా ఉంటుంది. కుడివైపున ఉండే అవయవాలను ఎడమ అర్ధ భాగం నియంత్రిస్తుంది. అలాగే ఎడమవైపు ఉండే శరీర భాగాలను మెదడులోని కుడి అర్థభాగం నియంత్రిస్తుంది. అంటే మెదడులోని కుడి అర్ధ భాగం బలంగా ఉన్నవారిలో ఎడమ చేతివాటం వస్తుంది. పుట్టే బిడ్డ చేతుల్లోని సామర్ధ్యం జన్యువులపై ఆధారపడి ఉంటుంది. గర్భంలో పిండ దశలో ఉన్నప్పుడే బిడ్ద కుడిచేతివాటమా? ఎడమచేతి వాటమా? అనేది రూపుదిద్దుకుంటుంది.

నిజమా : మహిళల కోసం ప్రత్యేక మద్యం కౌంటర్లు!