News and Entertainment

శ్రీ మహా విష్ణువు 21 అవతారాలలో 12వ అవతారం ధన్వంతరి !


ధన్వంతరి
శ్రీమహా విష్ణువు 21 అవతారాలలో 12 వ అవతారం ధన్వంతరిదిగా వ్యాస భాగవతం పేర్కొంది. క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.

అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.
ధన్వంతరి అవతరణం ఆశ్వేయుజ బహుళ త్రయోదశినాడు జరిగిందని ఇతడు సూర్యుభగవానుని 16 మంది శిష్యులలో ఒకడని బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొని సర్వలోకాల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని అంటారు.


Pages: 1  2