News and Entertainment

‘బ్రహ్మోత్సవం’ ఆడియో డేట్. ఫిక్స్ ?



ప్రస్తుతం టాలీవుడ్  లో హాట్ టాక్స్ గా వినిపిస్తున్న న్యూస్ బ్రహ్మోత్సవం మూవీ ఆడియో ఫంక్షన్. ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుంది, బ్రహ్మోత్సవం మూవీ థియోట్రికల్ ట్రైలర్ ఏ విధంగా ఉంటుందంటూ ఇప్పటికే ఫ్యాన్స్ లో తెగ ఆసక్తి క్రియేట్ చేస్తుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

ఇదిలా ఉంటే తాజాగా బ్రహ్మోత్సవం మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ పై ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై అంచనాలు పెరిగిపోవటంతో ఈ మూవీలో జరుగుతున్న మార్పులపైనా సంచలనం ఏర్పడుతుంది. 



‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన సినిమా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల-మహేష్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. మిక్కీ జే. మేయర్ ఇప్పటికే బ్రహ్మోత్సవం మూవీకి సంబంధించిన ఆడియో ఆల్భమ్ ని పూర్తి చేస్తున్నాడు.

మరో రెండు సాంగ్ లు మినహా దాదాపు బ్రహ్మోత్సవం మూవీ ఆడియో ఆల్భం పూర్తయిందని అంటున్నారు. అయితే తాజాగా బ్రహ్మోత్సవం మూవీ ఆడియో ఫంక్షన్ ని ఏప్రిల్ 24న ఆడియో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. తిరుపతిలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారట. ఇక బ్రహ్మోత్సవం మూవీలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.