News and Entertainment

తప్పక ఆ పనికి ఒప్పుకున్న హీరోయిన్..!


మన సినీ ఇండస్ట్రీలో  స్టార్ హీరోయిన్ గా చెలామని అవ్వాలంటే కేవలం ఒక్క నటన ప్రాధాన్య ఉన్న పాత్రల్లోనే నటిస్తా అంటే కుదరదు.. కెరియర్లో హిట్లు పడ్డా ఎక్కడో ఓ చోట్ ఆడియెన్స్ తమని వేరే యాంగిల్లో చూడాలని ఆశపడతారని గ్రహించాలి లేకుంటే అవకాశాలు మందగిస్తాయి అని తెలుసుకోవాలి.. అయితే ఇన్నాళ్లు ఆ విషయం గుర్తించలేని ఓ భామ ఇకనుండి తాను కూడా స్కిన్ షోకు సై అంటుంది..

మలయాళంలో స్టార్ హీరోయిన్ గా ఎంతో క్రేజ్ సంపాధిచిన బ్యూటీ కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజా సూపర్ హిట్ అందుకుంది. ఎన్నోరోజులుగా గెలుపు కోసం పోరాటం చేస్తున్న రామ్ కు సూపర్ సక్సెస్ అందించిన ఈ మలయాళం బ్యూటీ కార్తి టాలీవుడ్ లక్కీ హీరోయిన్ అయ్యింది. అయితే ఆ సినిమా హిట్ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా వాటికి నో చెప్పేసింది. హిట్ కొట్టినందుకు ఆఫర్లు వచ్చినా వాటిని వాడుకోనందుకు కీర్తిని చూసి అందరు ఆశ్చర్యపోయారు.

అంతే కాకుండా తనకు ఎలాంటి అవకాశాలొచ్చినా సరే కేవలం నటనకు ఇంపార్టెన్స్ ఇచ్చిన పాత్రలే తప్ప మిగతావి చేయను అనేస్తుంది ఈ లక్కీ బ్యూటీ. ఇలా మడి కట్టుకు కూర్చుంటే పనులు కావు అని త్వరగానే గ్రహించిన చిన్నది ఇక తాను కూడా ఎక్కడ తగ్గేది లేదు అని రెచ్చిపోతుంది. ఈ మధ్యే ఓ టెంప్టింగ్ ఫోటో షూట్ తో తనలో ఉన్న మరో యాంగిల్ ను రుచి చూపించిన కీర్తి ఇకనుండి తను కూడా హాట్ అండ్ హాట్ గా స్కిన్ షో చేసేందుకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తుంది.

సో మరి స్టార్ హీరోల సినిమాలు కూడా మొదట్లో స్కిన్ షో అంటే వదులుకున్న ఈ భామ కూడా రూట్ మార్చి ఎలాంటి సినిమానైనా చేస్తా అనడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. మరి ఎలాగు స్కిన్ షోకి పచ్చజెండా ఊపేసింది కాబట్టి అమ్మడిని వాడేందుకు సిద్ధమయ్యారు దర్శక నిర్మాతలు.

More Articles