News and Entertainment

ఎన్ టి ఆర్ జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్
ఈ మద్య సినిమాలు షూటింగ్ మొదలు పూర్తి కలెక్షన్ల సాధించే వరకు సోషల్ మీడియాలో ఏదో రకంగా హల్ చల్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక షూటింగ్ ముహూర్తం అంటే అఫిషియల్ గా చేస్తారు..దానికి సంబంధించిన ఫోటోలు, వీడియో మీడియాలో రావడం కామన్ కానీ..ఎక్కడో సీక్రెట్ గా తీస్తున్న షూటింగ్ ఫోటోలు, సన్నివేశాలు లీక్ అయితే మాత్రం పెద్ద దుమారమే చెలరేగుతుంది. నిన్నటికి నిన్న శ్రీకాంత్ అడ్డాలు దర్శకత్వం వహిస్తున్న బ్రహ్మోత్సవం షూటింగ్ లో ఓ సన్నివేశం లీక్ అయ్యింది.

తాజాగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న జనతా గ్యారేజ్ గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్స్..ఫైట్ సీన్ కి సంబంధించిన ఓ ఫోటో లీక్ అయ్యింది. ఈ మధ్యే ముంబై షెడ్యూల్  పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్ టీం హైదరాబాద్ కి వచ్చింది.  హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభం అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం సంక్రాతి బరిలో నిలిచిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తిగా తన స్టైల్ మార్చాడు..మరి జనతా గ్యారేజ్ లో ఎలా ఉండబోతున్నాడో అన్న ఉత్సాహం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉంది.
జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ ఒక కొత్త లుక్ లో కనిపిస్తాడని ప్రచారం జరిగింది కానీ ఇంతవరకూ ఎన్టీఆర్ కొత్త లుక్ మాత్రం బయటకి రాలేదు.  ఈ ఫోటో చూస్తుంటే  ఎన్టీఆర్ గెడ్డం పెంచి రఫ్ గా కనిపిస్తున్నాడు.  మరి ఈ ఫోటోలను అభిమానులు ఉత్సాహం గా షేర్స్ చేసుకుంటున్నారు. నాన్నకు ప్రేమతో చిత్రంలో ఎన్టీఆర్ ఎంతో అఫిషియల్ గా చాలా రిచ్ గా ఉంటే జనతా గ్యారేజ్ లో మాత్రం ఫుల్ మాస్ గా సింపుల్ గా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లుక్ అంటూ కొన్ని ఫోటోలు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.