News and Entertainment

నమస్కారం, బొట్టు పెట్టడం శాస్త్రం కాదు సైన్స్ అది!నమస్కారం అనే మన సంస్కారం ఇప్పుడు హాయ్, బైలుగా మారింది. రెండు  చేతులు జోడించ్చి చెప్పే నమస్కారానికి చెల్లు చీటీ ఇచ్చి ఇప్పుడంతా ఒక్క చేతిని గాల్లో ఊపుతూ హాయ్ అంటూ ఆత్మీయత లేని పలకరింపులను పలకరిస్తున్నాం. అంతేనా…? 

నుదుటి మీద అందంగా నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకునే మన ఆడవాళ్లు వాటికి వీడ్కోలు పలికి ప్లాస్టిక్ బొట్టు బిల్లలనీ అది కూడా ఉందో లేదో అనే సైజ్ లో ఉన్న వాటిని పెట్టుకుంటున్నారు. మన సాంప్రదాయాలను ప్రస్తుత కాలంలో చాలా వరకు సైడ్ కు పెడుతున్నాం…. అసలు మన ఆచారాల్లో ఉన్న అసలు సైన్స్ గురించి తెలియకనే ఈ నిర్లక్ష్యమంతా….ఇప్పుడు నమస్కారం వెనకున్న శాస్త్రం ఏంటి? బొట్టు పెట్టుకోవడం వెనుకున్న సైన్స్ ఏంటో కాసింత తెలుసుకుందాం.