News and Entertainment

మాట తప్పిన పవన్ కళ్యాణ్ !



పవన్ కళ్యాణ్  ట్రెండ్ ఫాలో అవ్వడు సెట్ చేస్తాడు అని చిరంజీవి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో చాలా గొప్పగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే అనేక సార్లు వాయిదా పడి చిట్ట చివరకు పట్టాలు ఎక్కిన ‘సర్దార్’ మూవీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ అత్యంత వేగవంతంగా పూర్తి కావడానికి పవన్ ఒక హాలీవుడ్ ట్రెండ్ ను ఫాలో అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ సినిమా స్ర్కిప్టు ను పవన్ పూర్తిగా రాసిన తరువాత క్యారెక్టర్ లుక్ ఇలా ఉండాలి అంటూ పవన్ ఒక స్కెచ్ ని ఊహించుకున్నాడట. దానిని బేస్ చేసుకుని ఒక స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్  ఆ సీన్స్ ను డ్రా చేసి వాటిని యానిమేట్ చేసాడని టాక్. దానితో ఒక సీన్ లెంగ్త్ ఎంత ఉండాలి ఎంత ఉంటే  సినిమా చూసే ప్రేక్షకులకు ఎమోషన్ వర్కవుట్ అవుతుంది అనే విషయం ముందే తెలిసిపోతుంది అని అంటారు.