News and Entertainment

పవన్ రెమ్యునిరేషన్ చూస్తే షేక్ అవ్వాల్సిందే
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌ర్దార్ సినిమా తాజా షెడ్యూల్ ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్‌లో జ‌రుగుతోంది. బ్యాలెన్స్ ఉన్న ఓ పాట‌ను ప‌వ‌న్‌-కాజ‌ల్‌పై షూట్ చేస్తున్నారు. ఏప్రిల్ 1 లేదా 2వ తేదీల్లో స‌ర్దార్ సెన్సార్ కంప్లీట్ చేసి ఈ సినిమాను ఏప్రిల్ 8న ఉగాది కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే స‌ర్దార్ సినిమాలో న‌టించింనందుకు ప‌వ‌న్ ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడ‌నే విష‌యంపై ఇండ‌స్ర్టీలో హాట్ హాట్ డిస్క‌ర్ష‌న్లు జ‌రుగుతున్నాయి.సర్దార్‌ను ప‌వ‌న్ త‌న స‌న్నిహితుడు, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత శ‌ర‌త్‌మ‌రార్‌తో క‌లిసి సంయుక్తంగా నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స‌ర్దార్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.100 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. స‌ర్దార్ సినిమా రైట్స్‌ను ఏరోస్ సంస్థ ద‌క్కించుకోగా ఇప్ప‌టికే అన్ని ఏరియాల్లోను బిజినెస్ కంప్లీట్ అయిన‌ట్టు తెలుస్తోంది. 


ఈ బిజినెస్ ప్ర‌కారం చూస్తే ప‌వ‌న్‌కు రూ.30 కోట్ల వ‌ర‌కు అమౌంట్ ముట్టిన‌ట్టు తెలుస్తోంది.ఇక సినిమా రిలీజ్ అయ్యి భారీ వ‌సూళ్లు రాబ‌డితే వ‌చ్చే లాభాల్లో కూడా ప‌వ‌న్‌కు వాటా ఉంటుంద‌ని టాక్‌. గ‌తంలో మ‌హేష్‌బాబు కూడా శ్రీమంతుడు సినిమా విష‌యంలో పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హరించి రూ.22 కోట్ల వ‌ర‌కు లాభాలు మూట‌క‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప‌వ‌న్ కూడా అదే ట్రెండ్‌లో వెళుతూ ఇప్ప‌టికే రూ.30 కోట్లు త‌న జేబులో వేసుకున్నాడ‌ని ఇండ‌స్ర్టీ టాక్‌. 


మ‌రి సినిమా రిలీజ్ అయ్యి లాభాలు తెచ్చిపెడితే మ‌రింత మొత్తం ప‌వ‌న్ ఖాతాలో ప‌డ‌నుంది. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు కేఎస్‌.ర‌వీంద్ర‌(బాబి) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. సంజ‌న‌, రాయ్‌ల‌క్ష్మీ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.