News and Entertainment

రాజకీయాలలోకి రాంచరణ్ !




ఈ హెడ్డింగ్ చూసి మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడ‌ని షాక్ అవుతున్నారా చెర్రీ తండి చిరు, బాబాయ్ ప‌వ‌న్‌లాగా రియ‌ల్ లైఫ్ పొలిటిష‌న్‌గా మార‌డం లేదు..రీల్ లైఫ్ పొలిటిష‌య‌న్‌గా మారుతున్నాడు. రొటీన్ చిత్రాల మూస‌లో ప‌డిపోయిన చ‌రణ్‌.. దాని నుంచి బ‌య‌ట‌కు రావాలని ప్ర‌య‌త్నిస్తున్నాడు. అందుకే కొత్త కాన్సెఫ్ట్ ఉన్న స్టోరీల‌ను ఎంచుకునేందుకు చెర్రీ ఆస‌క్తి చూపుతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ఓ యంగ్ డైరెక్ట‌ర్ పొలిటిక‌ల్ నేప‌థ్యంలో చెప్పిన స్టోరీకి చెర్రీ ఓటేసిన‌ట్టు తెలుస్తోంది.




గ‌తంలో మిస్ట‌ర్ నూక‌య్య‌, అసాధ్యుడు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం చేసిన‌.. అనిల్ కృష్ణ క‌న్నెగంటి.. రీసెంట్‌గా సందీప్ కిష‌న్ హీరోగా `ర‌న్‌` అనే సినిమాను తెర‌కెక్కించాడు. ‘మిస్టర్ నూకయ్య’ సినిమాను తీస్తున్న టైంలోనే అనిల్ ఓ కథను చెర్రీకి వినిపించాడట. ఆ కథ చరణ్‌కి నచ్చినా అప్పట్లో సినిమా చేయడం కుదరలేదట.


ఇప్పుడు కొత్త క‌థ‌ల‌తోనే సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్న చెర్రీ అనిల్ చెప్పిన లైన్‌ను డ‌వ‌ల‌ప్ చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. అన్ని క‌రెక్టుగా సెట్ అయితే వచ్చే ఎన్నికల్లోపు ఈ సినిమా తెరమీదికి వచ్చే అవకాశాలున్నాయి.


 ఇదిలా ఉంటే రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘తనీ ఒరువన్’ రీమేక్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కంప్లీట్ అయ్యాకే చెర్రీ నెక్ట్స్ మూవీపై స్ప‌ష్ట‌త రానుంది.