News and Entertainment

ఐటం సాంగ్స్ మొదలుపెట్టిన సమంత !



కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, ఇప్పుడు ఓ తెలుగు రిమేక్ మూవీ చేయాలని చూస్తున్నాడు. పందెంకోడి కమర్షియల్‌ హిట్ తరువాత, ఇటువంటి ఎన్నో కమర్షియల్ హిట్స్ ని తెలుగులో విశాల్ అందుకున్నాడు. ఇక తాజాగా ఈ హీరో విశాల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో నల్లమలుపుబుజ్జి, ఠాగూర్ మధు, బండ్ల గణేష్ లు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ విజయానికి ధీటుగా, విశాల్ తోనూ ఈ మూవీని నిర్మించి సక్సెస్ కొడతామని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో స్పెషల్ ఎట్రాక్షన్ కోసం విశాల్ సరసన సమంతని ఓ స్పెషల్ సాంగ్ లో తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి.