News and Entertainment

దుమ్మురేపుతున్న సరైనోడు వీడియో(ప్రోమో) సాంగ్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో... సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో... విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'సరైనోడు'. 

తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమా ప్రమోషన్లో భాగంగా... అల్లు అర్జున్, అంజలిపై చిత్రీకరించిన 'బ్లాక్ బస్టర్' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు.