News and Entertainment

సర్ధార్ ఫ్లాప్ ప్రచారం !


పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పై కొన్ని వర్గాలు చేస్తున్న నెగిటివ్ ప్రచారం తారస్థాయికి చేరుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘సర్దార్’ బిజినెస్ పై వస్తున్న వార్తలు కూడ యదార్దాలు కావని ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లలో మానసిక ధైర్యాన్ని నింపడానికి ఈసినిమాను పంపిణి చేస్తున్న ఈరోస్ సంస్థ అదేవిధంగా ఈసినిమా నిర్మాత శరత్ మరార్ వ్యూహాత్మకంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పై ఒక1 కృత్రిమ హైక్ ను క్రియేట్ చేసారు అన్న వార్తలు వస్తున్నాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈసినిమాను బాలీవుడ్ లో ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చేసారట.