News and Entertainment

సర్ధార్ పులి స్వారీ..నిజమా?





‘సర్దార్ గబ్బర్ సింగ్’ వ్యవహారం ప్రస్తుతం పులి స్వారీగా మారింది అన్నకామెంట్స్ వస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ కాలంతో పరుగులు తీస్తూ ‘సర్దార్’ సినిమా విషయంలో పడుతున్న కష్టం ఆశ్చర్యంగానే కాకుండా పులి స్వారీగా మారింది అని అంటున్నారు. ఈకామెంట్స్ ఇలారావడానికి కొన్ని ఆసక్తికర కారణాలు ఉన్నాయి. దాదాపు 100 కోట్ల బిజినెస్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా వ్యవహారం పవన్ కు తలనొప్పిగా మారింది అనే కామెంట్స్ కూడ ఉన్నాయి. 

ఈసినిమా ఫలితంలో ఏమైనా తేడా జరిగితే ఈసినిమాకు జరిగిన భారీ బిజినెస్ రీత్యా బయ్యర్లు దాదాపు 25 కోట్ల నుండి 50 కోట్ల వరకు నష్టపోయే ఆస్కారం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. అటువంటి అనుకోని పరిస్తుతులే ఏర్పడితే క్రితం సంవత్సరం రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాకు వచ్చిన సమస్యలే ‘సర్దార్’ ను వెంటాడినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దీనికితోడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ క్రేజ్ ఈసినిమా పాటలు ట్రైలర్ విడుదలైన తరువాత నెమ్మదినెమ్మదిగా తగ్గిపోతోంది అని జరుగుతున్న నెగిటివ్ ప్రచారం పవన్ విపరీతంగా కలవర పెడుతోంది అని అంటున్నారు.




దీనితో ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లు ఏమాత్రం నష్టపోకుండా ఈసినిమా పై క్రేజ్ పడిపోకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పవన్ చేస్తున్నాడు అని టాక్. దీనికోసం ఈసినిమా సెన్సారింగ్ కార్యక్రమాలను మార్చి 31న కాని లేదంటే ఏప్రియల్ 1న కాని పూర్తి చేయాలని పవన్ కృత నిశ్చయంతో ఉన్నట్లు టాక్. ఈసినిమాకు సంబంధించి ఇప్పటి వరకు తయారైన ఫైనల్ కాపీని ముందుగా సెన్సార్ చేయించి ఆతరువాత యూరప్ లో పవన్ కాజల్ లపై చిత్రీకరించిన  పాటలు సెన్సారింగ్ కార్యక్రమాన్ని ఏప్రియల్ 3కు పూర్తి చేసి ఫైనల్ ఎడిటింగ్ కాపీని 4వ తారీఖుకు రెడీ పెట్టాలని పవన్ యూరప్ నుండి తన టీమ్ కు ఆదేశాలు జారీ చేసినట్లు టాక్.




ఈసినిమా ఓవర్సీస్ హక్కులను 10 కోట్లకు అక్కడి బయ్యర్లు కొనుక్కున్న నేపధ్యంలో ఈసినిమా రిలీజ్ టాక్ రాకుండానే  ఏప్రియల్ 7వ తారీకు రాత్రి తారీఖున భారీ స్థాయిలో అమెరికాలో ప్రీమియర్ షోలను వేయకపోతే తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటామని ఈ సినిమాను కొనుక్కున్న ఓవర్సీస్ బయ్యర్లు అదేవిధంగా ఈరోస్ ఇంటర్నేషనల్ ఈసినిమా నిర్మాత శరత్ మరార్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈసినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు కూడ ఈసినిమా పై వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని శరత్ మరార్ దృష్టికి తీసుకు వచ్చి తమకు గ్యారెంటీ ఎగ్రిమెంట్లు కావాలి అని ఒత్తిడి చేస్తున్నట్లుగా గాసిప్పులు సందడి చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను  బట్టి పవన్ ‘సర్దార్’ వ్యవహార శైలి పులి స్వారీని గుర్తుకు చేస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..