News and Entertainment

పవన్ సర్ధార్ లో 20నిమిషాల షాక్ !


ఏప్రిల్ లో విడుదల కాబోతున్న రాబోతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో ఒక ఆసక్తికరమైన 20 నిముషాల సీక్రెట్ బయట పడింది. మొన్న ‘సర్దార్’ ఆడియో వేడుకలో విడుదలైన ట్రైలర్ ను బట్టి ఈ అంచనాలకు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైలర్ ప్రారంభమైన ఒక నిముషం వరకు పవన్ కనిపించని విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన మార్కు కిక్ ఇవ్వడానికి ఏకంగా ఒక నిమిషం తీసుకున్నాడు.

ఒక పెద్ద హీరో సినిమా ట్రైలర్ లో అసలు హీరో కనపబడకుండా ఒక నిమిషం పాటు ట్రైలర్ ను ఇతర ఆర్టిస్టులతో నడిపించడం అంటే చాల సాహసం కాని అటువంటి సాహసం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో చేయడం వెనుక బలమైన కారణం ఉంది అని టాక్.  ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో కూడ ముందుగా ఇంతకంటే భారీ ల్యాగ్ ఉండబోతోంది అని తెలుస్తోంది.

ప్రస్తుతం ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారo ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా మొదలయ్యాక 20 నిమిషాల తరువాత మాత్రమే పవన్ ఎంట్రీ ఉంటుందట. అప్పటివరకు కేవలం విలన్ ను ఇంట్రొడ్యూస్ చేయడం ఆ ఊరిలో జనాలు ప్రిన్సెస్ కాజల్ ఇలా వీటితోనే సినిమానునడిపిస్తారట. అయితే ఒక్కసారి పవన్ ఎంట్రీ ఇచ్చుకున్నాక మాత్రం ఇక సినిమా పరిగెత్తుతూ ఉంటుందని టాక్. కాని సినిమా ప్రారంభం అయ్యాక 20 నిముషాల పాటు పవన్ స్క్రీన్ పై కనిపించకుండా ఉంటే పవన్ వీరాభిమానులు ఎంత వరకు ఆదరిస్తారు అన్నది ప్రశ్న ? ఈ వార్తలు ఇలా ఉండగా ‘సర్దార్’ ట్రైలర్ కు వచ్చిన మిశ్రమ స్పందన పవన్ దృష్టి వరకు వెళ్ళడంతో మరో ట్రయిలర్ కట్ చేయమని పవన్ శరత్ మరార్ కు చెప్పాడట.

దానితో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ వారంలోనే ‘సర్దార్’ రెండవ ట్రైలర్ విడుదల అవుతుంది అని టాక్. ‘బాహుబలిని’ దాటిపోవాలని ప్రయత్నిస్తున్న ‘సర్దార్’ తొలి ట్రయిలర్ ను పవన్ దగ్గర వుండి కట్ చేయించాడని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన పన్నెండు గంటలు కష్టపడ్డాడట. అయితే  పన్నెండు గంటలు కష్ట పడ్డ ట్రైలర్ ఇలా ఉంది ఏమిటి అని సెటైర్లు పడుతున్నాయి.