News and Entertainment

గాన కోకిల సుశీల గిన్నీస్ రికార్డ్ !

చిన్నప్పటి నుంచీ కూడా పాటలంటే ఎక్కువ తెలిసిందీ, విన్నదీ తెలుగు సినిమా పాటలే. బాగా చిన్నప్పుడు మొదట విన్నది రేడియోలో వచ్చే పాటలు. అప్పట్లో రేడియోలో ఏ పాట వచ్చినా ఎక్కువ ఫలానా గీతం.. పాడినవారు ఘంటసాల, పి.సుశీల అని చెప్పేవారు. లేకపోతే ఎస్పీ బాలు, పి.సుశీల పాడారని చెప్పేవారు.   ఆమె మధుర గానానికి ప్రతిఫలం దక్కింది..పి. సుశీల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. గానకోకిలగా పేరుపొందిన ఆమె సోలో, డ్యూయట్‌, కోరస్‌లతో కలిసి ఆరు భాషల్లో మొత్తం 17,695 పాటలు పా డినందుకు గానూ ఈ ఘనత లభించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆమె తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తులు భాషల్లో పాటలు పాడి శ్రోతలను అలరించారు. 80 ఏళ్ల పి సుశీల  విజయనగరం కాలేజ్ లో సంగీతం నేర్చుకున్నారు. అలాగే ఆమె ఇప్పటి వరకు ఐదు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. పలు సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ పాడి సుశీల గారు మెలోడీ క్వీన్ గా పేరుగాంచారు.
1950లో  గాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన పులపాక సుశీల 2008లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్‌ అవార్డును పొందారు. ఉత్తమ నేపథ్య గాయనిగా ఐదు సార్లు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. సినిమాల్లోనే కాక పలు భక్తిగీతాలు కూడా పాడి ఆల్బమ్స్‌ విడుదల చేశారు. 1952లో తమిళ చిత్రం 'పెట్రతాయి' (తెలుగులో 'కన్నతల్లి') ద్వారా సినీ సీమకు గాయనిగా పరిచయమైన  ఎన్నో భాషల్లో సినీ, ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు 40 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా.


పాడిన పాటలన్నీ ఒక చోట రాసుకోవడం, వాటిని సేకరించుకోవడం అనేది అసలు తెలీదు. సంగీత దర్శకులు, అభిమానుల ఆదరణతో అలా సాగిపోయాను. ఇప్పుడు కూడా నా పేరు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదైంది అంటే కారణం నా గొప్ప కానేకాదు. నా అభిమానుల గొప్పే. నా పాటలంటే అభిమానించే ఏడుగురు అభిమానులు అవిశ్రాంతంగా చేసిన కృషికి ఫలితవమే ఈ రికార్డు. ఇందుకు వారికి కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.