News and Entertainment

సర్ధార్ క్లైమాక్స్ లో ట్విస్ట్



ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా  పవన్ కళ్యాన్ నటిస్తున్న ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం నిలిచింది.  భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కు  నోటీసులు ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్' చిత్రాన్ని తెలుగులో పవన్ 'గబ్బర్ సింగ్' గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. 

బాలీవుడ్ లో అప్పటి వరకు కెరీర్ గురించి కొట్టు మిట్టు లాడుతున్న సల్మాన్ ఖాన్ ‘దబంగ్’ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో మరోసారి పుంజుకున్నాడు...అంతే కాదు తెలుగు లో కూడా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ పెరిగిపోయింది. 




ఇప్పుడు తాజాగా ఇదే పోలిస్ పాత్ర ఆధారంగా పవన్ గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా 'సర్దార్ గబ్బర్ సింగ్' చేస్తున్నాడు. దీంతో దబాంగ్ చిత్ర నిర్మాతలు అర్బాజ్ ఖాన్ మరియు దిల్లిన్ మెహ్తా లు  సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం మేకర్స్ మీద కాపి రైట్స్ ఉల్లంగణ చట్టం కింద కేసు వేసినట్లు సమాచారం. సర్దార్ గబ్బర్ సింగ్ అనే పేరు తమ కాపీరైట్స్ ను ఉల్లంఘిస్తోందని, సినిమాలో తమకు సంబంధించిన చాలా అంశాలున్నాయని సర్దార్ హిందీ ప్రొడ్యూసర్లకు అర్బాజ్ ఖాన్ నోటీసులు పంపించాడట. 

నోటీసుల గురించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రానప్పటికీ, పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇది తమకు చాలా మంచి సంకేతమని భావిస్తున్నారు.  గతంలో గబ్బర్ సింగ్ టైం లో కొంత మంది హిందీ ప్రొడ్యూసర్లు ఆ సినిమాపై కేసులు వేసి, పాతిక లక్షలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది.



ఇప్పుడు సర్దార్ కూడా బ్లాక్ బస్టర్ అవబోతోందంటూ ఆనందిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మరో పక్క ఇప్పటికే ఏప్రిల్ 8న కచ్చితంగా సర్దార్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఇలా కేసు వ్యవహారం బయటికి రావడంతో పవన్ అభిమానులు సినిమా అనుకున్న సమయానికి వస్తుందా అని గుబులు పడుతున్నారు.ఈ వ్యవహారాన్ని, ఎరోస్ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.