News and Entertainment

నిజమా : మహిళల కోసం ప్రత్యేక మద్యం కౌంటర్లు!


ఈ మద్య మగవారితో సమానంగా ఆడవారు కూడా మద్యం తాగడం లో ముందు ఉంటున్నారు..కానీ వీరు మగవారి వాలే మద్యం షాపులోకి వెళ్లి మద్యం తీసుకుందామంటే అక్కడి జనాలు వీరిని ఓ మాదిరి చూడడం తో కాస్త ఇబ్బంది పడుతున్నారు.. అందుకే అలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఢిల్లీలో వారికి ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి మద్యం అమ్మకాల్లో కొత్త ట్రెండ్‌కు తెరలేపాడు.
వీరికోసం ఏర్పాటు చేసిన కౌంటర్లలో మహిళలు మాత్రమే మద్యం అమ్మకాలు చేస్తారు. అలాగే వీరికి ప్రత్యేకంగా రూమ్‌లు ఉంటాయి. వీరు మద్యం కొనుక్కుని ఆ స్పెషల్‌ రూమ్స్‌లో మహిళల మధ్యలో ఎంజాయ్‌ చేస్తూ మందేయొచ్చు అన్నమాట.. ఈ వార్త తెలుసుకున్న హైదరాబాద్ అమ్మాయిలు కూడా ఇక్కడ కూడా అలాంటి ఏర్పటు చేస్తే ఎంత బాగుండో అని అనుకుంటున్నారు.