News and Entertainment

అమెరికా లో ఏలియన్స్ ని బందించి ఉంచిన ప్రదేశం - PART-4


1600లో ఇటలీలోని బ్రూనో అనే సన్యాసి మాట్లాడుతూ.:
ఇక 1600లో ఇటలీలోని బ్రూనో అనే సన్యాసి మాట్లాడుతూ అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ భూమిలాంటి అనేక గ్రహాలు తిరుగుతున్నాయి. అందులో మన లాంటి జీవులు నివసించవచ్చు. అవికూడా మనలాగే తెలివైనవా, లేకా మనకంటే తెలివైన జీవులు కావచ్చని తెలిపారు. ఆయన వ్యాఖ్యాలను ఖండించి అయనను కాల్చి చంపారు కొందరు.
కొన్ని శతాబ్దాల క్రితం ఈ భూమిని దాటి మరో జగత్తులేదని చాలా మంది నమ్మే వారు. వారి నమ్మకాన్ని శాస్తవ్రేత్తలు తప్పని నిరూపించారు. భూమికేవలం అనంత విశ్వంలో భాగమే. మరి ఇలాంటి అనంత విశ్వంలో ఎక్కడో అక్కడో మరోప్రాణి శ్వాసతీసుకుంటూ బ్రతికుండే అవకాశాలు లేకపోలేదు.
మనకు వేరే గ్రహవాసులు ‘ఏలియన్‌’ అయితే, మనమూ వాటికీ ‘ఏలియన్ల’మే
వాటి జాడ కనుక్కోవడం మనకు చాలా కష్టంగా పరిణమించింది. మనం చూడలేని ప్రతి దాన్ని మనం కాదని అనలేం. మనకు వేరే గ్రహవాసులు ‘ఏలియన్‌’ అయితే, మనమూ వాటికీ ‘ఏలియన్ల’మే. మనలా అవి కూడా మన జాడకోసం వెతుకుతున్నాయేమో? ఒంటరిగా ఉన్నాం అనుకుంటున్న మనం వాటిని ఏదోక రోజు ఎదుర్కోవాలేమో? మరి మన భూమిపై అవి వచ్చినప్పుడు అతిధి దేవో భవ అని ఆతిధ్యం ఇస్తామా..లేక న్యూక్‌తో పేల్చేస్థామా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెబుతుంది.
1947 జులై 4వ తేది. వింతగా ఉన్న సిల్వర్‌ రంగులో ఉన్న ఒక ఎగిరే పళ్లం క్రాష్‌ అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న జీవిల్లో అన్నీ చనిపోగా ఒకటి మాత్రం సజీవంగా ఉంది.ఈ ఎగిరే పళ్లం (యూఎఫ్‌ఓ-అన్‌ ఐడెంటిఫైడ్‌ ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్‌) గురించి సైనికులు వెదకడం ప్రారంభించారు.