News and Entertainment

తన 100వ సినిమాకి ఆస్కార్ రావడం ఖాయమంటున్న బాలయ్య



నందమూరి సింహం బాలకృష్ణ దృష్టి ఆస్కార్ అవార్డు పై పడింది అంటూ ఈ రోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆసక్తికర కధనాన్ని ప్రచురించింది. వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇదినిజం. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ తన సన్నిహితులతో చేపుతున్నాడని ఆ పత్రిక కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టింది.

నందమూరి అభిమానులు జోష్ లోకి వెళ్ళి పోయే ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే మొన్న రాత్రి బాలకృష్ణ తన మనవడు దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన డిన్నర్ కు వచ్చిన అతిధులతో తన లేటెస్ట్ లుక్ గురించి ప్రస్తావనలు వచ్చిన నేపధ్యంలో తను చేయబోతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ద్వారా తనకు ఆస్కార్ అవార్డు వస్తుంది అని భావిస్తున్నాను అంటూ తన షాకింగ్ డ్రీమ్ ను బయట పెట్టినట్లు టాక్.
తన 100వ సినిమాగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫైనల్ అయింది అని చెపుతూ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుది అని తానూ పోషించే చక్రవర్తి శాతకర్ణి పాత్రకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడమే కాకుండా ఆస్కార్ అవార్డ్వ్ కు ఎంపిక అవుతుంది  అన్న నమ్మకం తనకు ఉంది అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనిని బట్టి చూస్తూ ఉంటే బాలయ్య తన 100వ సినిమా విషయమై ఒక స్థిరనిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. ట్విస్ట్ ఏమిటంటే విశ్వవిఖ్యాత నట సార్వభోమగా తెలుగు సినిమారంగాన్ని రాముడిగా కృష్ణుడిగా ఏలిన నందమూరి తారకరామారావుకి కూడ దక్కని ఆస్కార్ అదృష్టం బాలయ్యకు లభిస్తే అది ఒక చరిత్ర అవుతుంది. ఇంతకీ బాలకృష్ణ తన నిర్ణయం మార్చుకోకుండా ఈ ఆస్కార్ అవార్డు తెచ్చుకునే పనిని ఎప్పుడు ప్రారంభిస్తాడో చూడాలి.