News and Entertainment

మీరు ఎప్పుడూ యవ్వనంలోనే ఉండాలనుకుంటున్నారా?


యంగ్‌గా కనిపించాలా? మెదడును యవ్వనంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇందుకోసం పెద్దగా కష్టపడక్కర్లేదని పరిశోధకులు అంటున్నారు. రోజూ కేవలం రెండు అంతస్తుల మెట్లు ఎక్కితేనే యంగ్‌గా కనిపిస్తారని కెనడాలోని కంకార్డియా వర్శిటీ పరిశోధకులు చెప్తున్నారు. ఇలా రోజూ చేస్తుంటే వయస్సు తగ్గినట్లు కనిపిస్తుందని తెలుస్తోంది. అలాగే ఎక్కువ కాలం విద్యాభ్యాసం కొనసాగించినా కూడా మెదడు పని తీరు చాలా మెరుగ్గా ఉంటుంది.
*నిద్ర రావట్లేదా?ఇలా చేయండి కేవలం 60 సెకన్లలో నిద్రపోతారు!
*అమ్మో! ఈ అబ్బాయిలు ఫోటో చుసే అమ్మాయి ఎలంటిదో చెప్పెస్తారట! సాధారణంగా మెదడులో ఉండే గ్రే మేటర్ పెరుగుదల తగ్గితే మెదడు వయస్సు తగ్గుతుంది. 19 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న 331 మందిపై శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో మెట్లు ఎక్కడంతో పాటు విద్యాభ్యాసం ఎక్కువ కాలం కొనసాగించిన వారిలో మెదడు యవ్వనంగా ఉందని తెలిసింది. ఇతర వ్యాయామాల కంటే మెట్లెక్కడం వల్ల మెదడులో గ్రే మేటర్‌ బాగా తగ్గినట్లు ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా మెదడు ఉత్సాహంగా ఉంటుందని గుర్తించడం జరిగిందని పరిశోధకులు తెలిపారు
 *నిద్రలో హఠాత్తుగా ఉలిక్కిపడి లేచారా? అలా ఎందుకు జరుగుతుందో తెలుసా?