News and Entertainment

ఇలియానాకు లెటర్ రాసిన ఒబామా!


అవును.. అమెరికా అధ్యక్షుడు ఒబామ ఇలియానాకు లేఖ రాశారు. అంటే మొయిల్‌ చేశారు. ఇలియానా అంటే మన టాలీవుడ్‌ హీరోయిన్‌ అనుకునేరు. క్యూబా దేశానికి చెందిన ఇలియానా యార్జా. అయితే మాత్రం ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? ఆగండి.. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆమెరికా నుంచి క్యూబాకు వచ్చిన తొలి లేఖ ఇది. ఈ రెండు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా సంబంధాలు అంతగా లేవన్నది తెలిసిందే. 1960లకే శత్రు దేశాలుగా ఉన్న తరుణంలో న్యూయార్క్‌ నుంచి క్యూబాకు ఓ లెటర్‌ బాంబ్‌ వెళ్లింది. అప్పట్నుంచి ఈ రెండు దేశల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను నిలిపేశారు.

ఈ నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత క్యూబాకు చెందిన ఇలియానా.. ఒబామాకు ఓ లేఖ రాశారు. హవానాలోని తన ఇంటికి వచ్చి క్యూబా కాఫీ రుచి చూడాలని ఇలియానా ఆ లేఖలో కోరారు. ఆ లేఖకు స్పందించిన ఒబామా సానుకూలంగా స్పందించారు. ఈ ఆదివారం క్యూబాకు రావాలని నిర్ణయించుకున్నానని, తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలని ఇలియానాకు ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో ఇలియానాతోపాటు క్యూబా మొత్తం పులకించిపోయింది. కాగా, 1928 తర్వాత క్యూబా గడ్డ మీద కాలు పెడుతున్న అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలువనున్నారు.