News and Entertainment

తెలుగు సినిమాని నాశనం చేస్తున్న పవన్-మహేష్ లు !


దొరికితే మంచి తమిళ సినిమా హక్కులు కొనేసి రీమేక్ చేసి పారేస్తున్నారు లేదంటే ఒక తమిళ డైరెక్టర్ తో సినిమా తీసేస్తున్నారు. ఇదీ ప్రస్తుతం తెలుగు సినిమా గురించి రెండు ముక్కల్లో చెప్పగలిగిన విశేషం. తమిళ సినిమా రీమేక్ ల మీద తెగ ఉత్సాహం చూపిస్తున్నారు తెలుగు హీరోలు. ఇదే సమయంలో తమిళ డైరెక్టర్ ల చేతిలో తమ డేట్ లు పెట్టడానికి కూడా వెనకాడట్లేదు. తెలుగు హీరోల్లో దాదాపు అందరూ ఇప్పుడు రీమేక్ బొమ్మల వెంట పడ్డారు. మెగా ఫ్యామిలీ హీరోలు మరీ ముఖ్యంగా అదే బాట పట్టారు. చిరంజీవి 150 సినిమా విజయ్ కత్తి రీమేక్ గా ఒస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా రాం చరణ్ - తానీ ఒరువన్ అనే సినిమాని రీమేక్ చేస్తున్నాడు.

వీళ్ళిద్దరూ కాకుండా చైనా హీరోలు తో కలిపి తమిళ రీమేక్ ల సంఖ్య 12 వరకూ ఉందట. లోకల్ టాలెంట్ ని గాలికి ఒదిలేసి, ఇక్కడి కథలని కనీసం వినను కూడా వినే ఆలోచన చెయ్యడం లేదు చాలా మంది. తమిళ డైరెక్టర్ లని పిలిచి మరీ అవకాశాలు ఇస్తూ ఉండడం విశేషం. ఎవరో కుర్ర హీరోలు , నిన్న కాక మొన్న ఒచ్చినవారు ఇలా చేసారు అంటే అనుకోవచ్చు. సాక్షాత్తూ పవన్ కళ్యాణ్, అల్లూ అర్జున్ , మహేష్ బాబులే ఈ కోవలోకి జేరిపోయారు. మురుగదాస్ తో మహేష్ - లింగుస్వామి తో అల్లూ అర్జున్ - పవన్ కళ్యాణ్ తో ఎస్జీ సూర్య సినిమాలు ఓకే అయిపోయాయి.


మురుగదాస్ సూపర్ ఫార్మ్ లో ఉన్నాడు. ఆయన సంగతి పక్కన పెడితే లింగు స్వామి ని పిలిపించుకుని మరీ ఛాన్స్ లు ఇవ్వాల్సిన పనేముంది అంటున్నారు చాలా మంది. ఇక ఎస్ జే సూర్య కి బుద్ది ఉన్నవాడు ఎవ్వడైనా ఛాన్స్ ఇస్తాడా ? ఈ పరిణామం టాలీవుడ్ కి మంచిది ఏనా ? కుర్ర డైరెక్టర్ లూ, పిచ్చగా ఉన్న టాలెంట్ ని పక్కన పెట్టేసి ఇలాంటి తమిళ రిమేక్ లూ, తమిళ కథలూ, తమిళ డైరెక్టర్ లూ అంటూ వారి వెంట పడి తెలుగు సినిమాని నాశనం చెయ్యడం లో పవన్ - మహేష్ లాంటి వారే ముందు ఉంటే ఎలా ?