News and Entertainment

మీరు మూడ నమ్మకాలను నమ్ముతారా?వాటి లాజిక్ లు తెలుసుకోండి!

మనుషులు పుట్టాక ఆచారాలు, మూఢ నమ్మకాలు మొదలయ్యాయి. ఎందుకు మొదలయ్యాయో, వాటిలో ఎంతవరకు నిజమో, ఆ మూఢనమ్మకాలు,ఆచారాలను పాటించకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమోనన్న అపోహ, భయం  అందరిలోనూ ఉంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు వాటిని పాటించడం, నమ్మడం ఒక కారణమైతే, చిన్నప్పటి నుండి మనకు పెద్దవాళ్ళు చెప్పడం, మనం కూడా వాటిని పాటించడం చేస్తున్నాం. అయితే వాటిని ఎందుకు పాటించాలి? ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుతుంది అనేదానికి సరైన కారణం మాత్రం ఎవ్వరూ చెప్పరు. కొన్నిటికి మాత్రం సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయిలెండి. మనం పాటించే పద్ధతులు ఒక ప్రాంత ప్రజలు చేయరు. ఇంకొకరు ఎంతో ఇష్టంగా చేసే పనులు మనం ఫాలోకాము.  మూఢనమ్మకాల వెనుకున్న రహస్యాలు తెలుసుకుందాం

1. మంగళవారం రోజున కటింగ్ ఎందుకు చేయించుకోకూడదు:


కటింగ్ లకు రోజులు , వారాలు ,తిధులతో పనిలేదు  కానీ..మంగళి వృత్తి చేసే వారికి సెలవు ఇవ్వడానికి పుట్టిందే ఆ ఆచారం. 
గతంలో ప్రతి సోమవారం సెలవు ఉండేదట. అందుకని చాలా మంది  సోమవారం కటింగ్ చేయించుకునేవాళ్ళు. సోమవారం ఫుల్ పని చేసిన మంగళి వారికి కూడా వారంలో ఓ రోజు సెలవుండాలి కాబట్టి , అందులోనూ సోమవారం పని ఎక్కువగా చేసి  బాగా అలసిపోతారు కాబట్టి…. అ మంగళవారం  సెలవ్.  అందుకే మంగళవారం కటింగ్ చేయించుకోవొద్దని ఓ నమ్మకం.

2. ఇంట్లో గొడుగులు ఓపెన్ చేస్తే మంచిది కాదు:

ఇంట్లో గొడుగు ఓపెన్ చేస్తే దాని ముందున్న ఐరన్ రాడ్డ్ ఇతరుల కంట్లో కుచ్చుకుంటుందని..ఇంట్లో గొడుగు సడెన్ గా ఓపెన్ చేయడం వలన దానికి దగ్గరలో ఉన్న వస్తువులకు తగలడంతో కిందపడిపోతాయి. అందుకే గొడుగు ఇంట్లో ఓపెన్ చేయవద్దని చెబుతారు. అలా చెబితే పెద్దగా పట్టించుకోరని  ఇంట్లో గొడుగు ఓపెన్ చేస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందని ట్యాగ్ లైన్ తగిలించారు.

3. షాపుల ముందు, ఇంటి ముందు, వాహనాలకు నిమ్మకాయ, పచ్చి మిర్చి, పండుమిర్చి కలగలిపి వేలాడదీసి ఉంచడం;

 ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు, అరిష్టాలు జరగవని, ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుందని చెబుతారు. కారణం అదికాదు. సైన్స్ ప్రకారం ఇలా వాటిని వేలాడదీయడం వలన ఇంట్లోకి క్రిమికీటకాలు, దోమలు, దుర్వాసన రాకుండా అరికడతాయని కట్టేవాళ్ళట.

4. పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు:

ఇంట్లో పగిలిన అద్దాలను  బయటపడేయమని  చెబుతారు.అలంటి వాటిలో చూసుకోకూడదని హెచ్చరిస్తారు. దీనికి ఓ కారణం ఉంది. పూర్వం అద్దాలు ఎక్కువ ధరకు అమ్మేవారు. అవి కూడా నాసిరకంగా ఉండేవి. అద్దం చూసుకునేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండటానికి ఇలాంటివి చెప్పేవారట. పగిలితే కొత్తది కొనడం కష్టమని…!

5. చీకటి పడ్డాక  గోళ్ళు,  కట్ చేయకూడదు;

చీకటి పడ్డాక గోళ్ళుకట్ చేసుకోకూడదని చెబుతుంటారు. ఈ విషయాన్ని ఎక్కువగా నమ్ముతారు. కారణం లేకపోలేదు. సూర్యాస్తమయం తర్వాత గోళ్ళు కత్తిరించుకోవడం వలన గోళ్ళకు బదులుగా చిగుళ్ళు కట్ చేసుకుంటారని అలా నమ్మకం క్రియేట్ చేశారు.

6. చీకటి పడ్డాక ఇళ్ళు ఊడవొద్దు:

సాయంత్రం దాటాక చీకటిపడ్డప్పుడు చీపురు  ఊడుస్తుంటే చీపురు పట్టుకోవద్దని చెప్పేవారు. చీకటి పడ్డ తర్వాత చీపురుపడితే ఏదో జరుగుతుందన్న భయం  క్రియేట్ చేశారు. పూర్వం సాయంత్రం తర్వాత చీకటి పడగానే చీపురు ముట్టుకోవద్దని ఎందుకు చెప్పేవారంటే తమకు తెలియకుండా కిందపడ్డ నగ,నట్ర చీపురుతో శుభ్రం చేసేటప్పుడు వాటితోపాటు కనిపించకుండా పోతాయని అలా చేసేవారు.

7. గ్రహణం సమయంలో గర్బిణీలు బయటికి రావొద్దు:

 గ్రహణం సమయంలో గర్భిణీలను బయటకు రావొద్దని, కూరగాయలు కట్ చేయవద్దని చెబుతారు. ఎందుకంటే గ్రహణం సమయంలో గర్భిణీగా ఉన్న వారి పొట్టపై యూవీ  కిరణాలు పడి బిడ్డకు హాని జరుగుతుందని ఒక నిబంధన ఉంది.