News and Entertainment

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో హైలెట్స్.. ఆడియో రివ్యూ..!


ఈ సాయంత్రం సర్దార్ గబ్బర్ సింగ్ జోష్ తో నిండినదని చెప్పాలి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తనలో ఉన్న తిక్క చూపించేందుకు సిద్ధమై తానే కథ, కథనాలు రాసుకుని చేస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్.. బాబి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పవర్ఫుల్ మ్యూజిక్ తో వచ్చింది.

మొదటి సాంగ్ రిలీజ్ చేసిన జెమిని కిరణ్.. ఈ సినిమాలో మొదటి సాంగ్ గా రిలీజ్ అయిన ఓ పిల్లా సుబానల్లా సాంగ్ ఓ మంచి మెలోడీ థీంతో స్టార్ట్ అయ్యింది.. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ఈ సాంగ్ ఆల్బంలో మంచి రొమాంటిక్ సాంగ్ అని చెప్పొచ్చు.. దేవి తనదైన మెలోడీ ఫీల్ ను ఈ పాటలో కలిగేలా చేశారు. శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది.

రెండవ సాంగ్ రిలీజ్ చేసిన Ntv అధినేత నరేంద్ర చౌదరి.. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అంటూ అరుపులు పెట్టించిన దేవి ఈ సినిమాలో ఐటం సాంగ్ గా వచ్చే ఈ సాంగ్ లో రాయ్ లక్ష్మితో సర్దార్ గబ్బర్ సింగ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అదరగొట్టే స్టెప్స్ తో ఆకట్టుకున్నాడు. రంభ ఊర్వశిలతో రాయ్ లక్ష్మిని పోల్చుతూ సాగే ఈ సాంగ్ ఎంతో హుశారుగా సాగింది. డేవిడ్ సిమోన్ ఈ పాట పాడటం జరిగింది.

మూడో సాంగ్ స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం రిలీజ్ చేశారు.. పవర్ స్టార్ సినిమాలో టైటిల్ సాంగ్ ఊపే వేరు.. పవర్ స్టామినాను చూపించే ఈ సాంగ్ కు దేవి మ్యూజిక్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ సాంగ్లో తెలుస్తుంది. ఆడియో రిలీజ్ కు ముందు టీజర్ గా రిలీజ్ చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. బెన్ని దయల్ పాడిన ఈ సాంగ్ సర్దార్ స్టామినా ఏంటో కనబడటమే కాదు వినపడేలా కూడా చేస్తుంది..


నాలుగో సాంగ్ సినిమాలో విలన్ గా చేసిన శరత్ ఇంకా స్పెషల్ రోల్ చేసిన సంజన రిలీజ్ చేశారు.. చేపకల్లు చేపకల్లు అంటూ సాగే ఈ పాట ఆల్బంలో మరో మెలోడీ సాంగ్ గా ఉంటుంది.. దేవి తమ్ముడు సాగర్, శ్రావణ భార్గవి పాడిన ఈ పాట శ్రోతలను ఎంతగానో అలరిస్తుంది.

ఐదో సాంగ్ రిలీజ్ చేశారు ముఖేశ్ రుషి, కబీర్.. చిన్నదాని చూపులోన.. అంటూ సినిమాలో మరో మాస్ బీట్ గా సాగే  ఈ సాంగ్ అభిమానులను సీట్లలో కూర్చోనివ్వలేదు. సింహా తో పాటుగా ఫీమేల్ సింగర్ పాడిన ఈ పాట ఆల్బం మొత్తానికి అదిరిపోయే హిట్ సాంగ్ అని చెప్పాలి.

ఆరో సాంగ్ రిలీజ్ చేశారు మాటల మాంత్రికుడు త్రివిక్రం.. సినిమాలో థీం సాంగ్ గా వచ్చే ఈ సాంగ్ జై జై నాయకా.. జై జై బాలకా అంటూ.. మొదలవుతుంది.. వాడెవడన్నా.. వీడెవడన్నా.. అంటూ థీంతో సాగే ఈ సాంగ్ కచ్చితంగా స్క్రీన్ పై మంచి సాంగ్ అయ్యే అవకాశం ఉంది.

ఆరు అద్భుతమైన పాటలందించిన దేవి పవర్ స్టార్ తో మరో హిట్ ఆల్బం అందుకున్నాడనే చెప్పాలి. ఇక ఏప్రిల్ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ట్రాక్:
ఓ పిల్లా సుబానల్లా
తోబ తోబ
గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్
చేపకల్లు చేపకల్లు
వాడెవడన్నా వీడెవడన్నా  

source:google