News and Entertainment

బాలీవుడ్ లో దుమ్మురేపుతున్న సర్ధార్ !


తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే..ఆ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా సర్ధార్ ఆడియో వేడుక గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్ధార్ విడుదలకు ముందు ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. అంతే కాదు ఈ చిత్రం హిందీలో కూడా విడుదలకాబోతుంది..ఇప్పటి వరకు పవన్ చిత్రాలు ఏక కాలంలో తెలుగు, హిందీ రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పటికే హిందీ , తెలుగు ట్రైలర్స్ దుమ్ము దులిపెస్తున్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ కు అక్కడ కూడా మంచి క్రేజ్ దక్కింది.

సర్ధార్ ఆడియో వేడుకలో చిరంజీవి అన్నట్లు ఈ చిత్రం చూస్తుంటే ఒకప్పటి షోలే చిత్రం గుర్తుకు వస్తుందని షోలె చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో ఈ చిత్రం కూడా అంతే విజయం సాధిస్తుందని అన్నారు. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ట్రైలర్ ను చుసిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సూపర్ అంటూ కంప్లిమేంట్ ఇవ్వడంతో పాటు సౌత్ సినిమాలు మరిన్ని బాలీవుడ్ లో విడుదల కావాలని అన్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ చూసి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెగ మెచ్చుకున్నాడు.

నిజంగా పవన్ గ్రేట్ .. ఆయనలా నేను అస్సలు చేయలేను అంటూ చెప్పేసాడు. ఖచ్చితంగా పవన్ బాలీవుడ్ లో హీరోగా నిలబడతాడు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. గతంలో సల్మాన్ నటించిన దబంగ్ చిత్రం రిమెగ్ గా ‘గబ్బర్ సింగ్ ’ వచ్చిన విషయం తెలిసిందే.. సాధారణంగా తెలుగు రిమేక్ చిత్రాల్లో నటించడంలో దిట్ట అయిన సల్మాన్ కన్ను ఈ చిత్రంపై పడిందా అని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించనుందో ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే

>> పవన్ కళ్యాణ్ 100 రూపాయిలుతో సమానమన్న వర్మ ! 
>> మహేష్ బ్రహ్మోత్సవం కొత్త టేజర్ !