News and Entertainment

బాహుబలి రహస్యాలను లీక్ చేసిన తమన్నా ?!


‘బాహుబలి 2’ విషయాలను అత్యంత గోప్యంగా ఉంచాలని రాజమౌళి అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ‘బాహుబలి 2’ లో తన పాత్రకు సంబంధించిన విషయాలను లీక్ చేసి రాజమౌళికి షాక్ ఇచ్చింది. ‘బాహుబలి 2’ లో తన పాత్ర చాల చిన్నది అని చెపుతూ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తనకు ఎటువంటి క్లారిటీ లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

‘బాహుబలి 2’ లో తన పాత్ర చిన్నదే అయినా తాను బాధ పడటం లేదని తన కెరియర్ కు ఒక మలుపు తిప్పిన సినిమాగా ‘బాహుబలి’ ని వర్ణించింది. ఇక ఇదే సందర్భంలో తాను నటిస్తున్న ‘ఊపిరి’ సినిమా గురించి మాట్లాడుతూ చక్రాల కుర్చీలో కూర్చునే పాత్రా చేసిన నాగార్జున ఈసినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన కాలు కదులుతోందా ? లేక వెళ్ళు కదులుతున్నాయా ? అని షూటింగ్ స్పాట్ లో ఇద్దరు అను నిత్యం పరిశీలిస్తూ ఉండేవారని చెప్పింది తమన్నా.
ఈనాటి యంగ్ హీరోలు అంతా  అక్కినేని నాగార్జునను చూసి నేర్చుకోవాలి అంటూ నేటి యంగ్ హీరోల పై సెటైర్ వేసింది తమన్నా. ఊపిరి’  సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం గురించి మాట్లాడుతూ. చాల సంవత్సరాలుగా తాను తెలుగు సినిమాలలో నటిస్తున్న నేపధ్యంలో తనకు తెలుగు బాగా రావడంతో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న విషయాన్ని బయట పెట్టింది తమన్నా. 


తాను చేయాల్సిన పాత్రకు ముందు శ్రుతి హాసన్ ను  ఎంచుకున్న సంగతి తనకు తెలుసని ఆమె ఏ కారణాలతో తప్పుకున్నప్పటికీ తనకు ఈ కథ, పాత్ర నచ్చడంతో మరో ఆలోచన లేకుండా ఈ సినిమా చేస్తున్నాను అంటూ శృతి పై కౌంటర్లు వేసింది ఈ మిల్కీ బ్యూటీ. అయితే తన కెరియర్ కు మాత్రం తన కుటుంబమే తన ‘ఊపిరి’ అని అంటోంది ఈ అవంతిక..