News and Entertainment

‘ముద్దు’ పెట్టుకునేప్పుడు ‘కళ్ళు’ ఎందుకు మూస్తారు?

ముద్దు..ఈ ఒక్క పదం మనలోని ఏదో తెలియని ఫీలింగ్ ని కల్గిస్తుంది..అసలు ముద్దు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..ఆడ, మగ అయితే ముద్దు కోసం తహతహలాడుతుంటారు. అందులోను తొలిముద్దు అనేది జీవితాంతం మరచిపోలేని అనుభూతి.

ముద్దు లోకూడా ఇష్ట అయిష్టాలు ఉంటాయి..పెదవుల్ని పెదవులతో ముడివేసి ఫ్రెంచ్ ముద్దు ను ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇకపోతే, ఘాటైన ముద్దు పెట్టుకునే సమయంలో అందరు కళ్ళు మూసుకుంటారు. మనకు తెలియకుండానే ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై పరిశోధకులు పరిశోధనలు చేశారు. మానవ మెదడు కొన్ని సమయాలలో ఒకే సమయంలో రెండు విధులను సమానంగా నిర్వహించలేదు.

ముఖ్యంగా సున్నితమైన విషయంలో, మనిషి శరీరంలో పెదవులు అన్నవి సున్నితమైన భాగాలు. పెదవులను పెదవులతో జోడించే సమయంలో మెదడులోని న్యూరాన్లు ఉత్తేజితం అవుతాయి. అలా అధిక సంఖ్యలో న్యూరాన్లు ఉత్తేజితం కావడంతో..మెదడు చూపుపై నియంత్రణను కోల్పోతుంది. దీంతో మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుపోతాయని పరిశోధకులు తెలిపారు.