News and Entertainment

10లక్షల సినిమాకి 1278 కోట్లు వచ్చాయి




ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ పెట్టుబ‌డితో రిలీజైన సినిమాకు భారీ వ‌సూళ్లు వ‌చ్చిన విష‌యం మీకు తెలుసా.. ? ఆ సినిమా ఏకంగా 50, కోట్లు, 100 కోట్లు కాదు ఏకంగా రూ. 1278 కోట్లు వ‌సూలు చేసిం సంచ‌ల‌నం సృష్టించింది “పారా నార్మ‌ల్ యాక్టివిటీ”. గత ఏడాది బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లు వసూళ్లు సాధించింది. ఆహా ఓహో అనుకున్నాం. 



కానీ ఆ సినిమా బడ్జెట్ రూ.130 కోట్లు. అదే ‘భలే భలే మగాడివోయ్’ సినిమా బడ్జెట్ రూ.6-7 కోట్ల మధ్యే. కానీ ఆ సినిమా రూ.50 కోట్ల వ‌ర‌కు గ్రాస్ కలెక్ట్ చేసింది. ‘బాహుబలి’ ఘనతలు ‘బాహుబలి’కి ఉన్నాయి కానీ.. దాంతో పోలిస్తే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాదే పెద్ద విజయం అనాలి.



ఓ సినిమా ఎంత వసూలు చేసింది అన్నదానికంటే పెట్టుబడి మీద ఎన్ని రెట్ల లాభం వచ్చిందన్నదాన్ని బట్టే ఓ సినిమా విజయాన్ని అంచనా వేయాలి. లాభాల పరంగా చూస్తే ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించిన సినిమా పేరు.. పారా నార్మల్ యాక్టివిటీ. ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్. ఫౌండ్ ఫుటేజ్ విధానంలో హార్రర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ కేవలం 15 వేల డాలర్లు. మన రూపాయల్లో దాదాపు 10 లక్షలన్న మాట. 2009లో విడుదలైన ఈ సినిమా ఒక్క అమెరికాలోనే ......