News and Entertainment

సమంత కి 7 కోట్లా !

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ సమంత. సమంత ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ క్రేజీ చిత్రాలను చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో సమంత వరుస మూవీలకి కమిట్ అవుతూ వస్తుంది. తను ఒకే సారి దాదాపు 3 చిత్రాలలో నటిస్తుంది.

ఈ మూడు చిత్రాలకి సంబంధించిన షూటింగ్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే, మరో చిత్రాలలో నటిస్తుంది. అయితే ఈ విషయంలో సమంత తన అప్ కమింగ్ మూవీల ప్లానింగ్స్ లో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది.  వరుస కమింట్మెంట్స్ తీసుకుంటూనే….ఏచిత్రానికి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. ముఖ్యంగా కాల్షీట్స్ ని ఎక్కడా డిస్ట్రబ్ కాకుండా చూసుకుంటుంది.అయితే ప్రస్తుతం సమయంలో సమంత రెమ్యునరేషన్ దాదాపు 1.5 కోట్ల వరకూ ఉంది. కనీసం కోటి రూపాయలు లేకుండా ఈ బ్యూటీ ఏ సినిమాని చేయటం లేదని అంటున్నారు. ఇక తనకి డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులని సంపాదించుకోవాలి అన్న ఫార్ములాని సమంత బాగా ఉపయోగించుకుంది. తన దగ్గరకు వస్తున్న ప్రతి ఆఫర్ కి అడ్వాన్స్ పేమంట్స్ ని తీసుకుంటుంది.

ప్రస్తుతం సమంత చేతిలో 8 చిత్రాలకి సంబంధించిన అడ్వాన్స్ పేమంట్స్ ఉన్నయని అంటున్నారు. వీటి మొత్తం విలువ దాదాపు 7 కోట్ల రూపాయల వరకూ విలువ ఉంటుందని అంటున్నారు. సమంత అడ్వాన్స్ పేమంట్స్ వివరాలు రీసెంట్ గా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లీక్ అవ్వటంతో ఇప్పుడు  ఈ న్యూస్ ఇండస్ట్రీలో షాకింగ్  గా మారింది.