News and Entertainment

95కోట్ల లాస్ లో సర్ధార్?



‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల అయి 10 రోజులు దాటిపోయినా ఈ సినిమా ఏ మేరకు ఎంత నష్టాన్ని తీసుకు వచ్చింది అన్న విషయమై ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ లేదు అని అంటున్నారు. రోజురోజుకు పడిపోతున్న ఈ సినిమా డ్రాప్ కలక్షన్స్ ప్రభావంతో ఈసినిమాకు ఏకంగా సుమారు 95 కోట్ల నష్టం వచ్చింది అంటూ కొన్ని వర్గాలు ఫిలింనగర్ లో చేస్తున్న ప్రచారం మరింత షాక్ ను ఇస్తోంది.

ఇప్పటికీ ‘సర్దార్’ అమెరికాలో 55 స్క్రీన్స్ లో ప్రదర్శింప బడుతూ ఉన్నా ఈసినిమాకు అమెరికాలో రెండోవ వారానికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన కలక్షన్స్ కేవలం 20,807 డాలర్స్ మాత్రమే అని వార్తలు రావడం అందర్నీ షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలో ఏ తెలుగు టాప్ హీరో సినిమాకు రాని  స్థాయిలో అత్యంత తక్కువ స్థాయి కలక్షన్స్ ఈ సినిమాకు రావడంతో ఒక్క అమెరికా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కే దాదాపు 4.5 కోట్ల నష్టం వచ్చింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.        Next>>