News and Entertainment

బాహుబలి-2 న్యూ ట్రైలర్ అదిరిపోయింది


ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'. 2015 జులై 10న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. 'బాహుబలి' అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూలేని భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ అంచనాలకు తగ్గట్టుగా ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల మన్ననలు పొందింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపు..బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం విడుదల కోసం టీమ్ ఎంత ఎదురుచూస్తోందో... అభిమానులు అంతకన్నా ఎక్కువగా ఎదురుచూపులతో ఉన్నారు.                                                                                           Next>>