News and Entertainment

సర్ధార్ పై బెట్టింగ్ రాజాలు
బెట్టింగ్ బెట్టింగ్‌… ఇప్ప‌టివ‌ర‌కూ క్రికెట్‌, ఎల‌క్ష‌న్స్‌కే ఎక్కువుగా ప‌రిమితం అయిన ఈ బెట్టింగ్ ఇప్పుడు సినిమాల‌కు పాకేశాయి. టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా స‌ర్దార్ పేరు మార్మోగుతోంది. స‌ర్దార్ ఫీవ‌ర్ ఎక్కువ‌గా ఉంది. 2013లో వ‌చ్చిన అత్తారింటికి దారేది సినిమా త‌ర్వాత ప‌వ‌న్ సోలోగా చేస్తోన్న సినిమా కావ‌డంతో పాటు ఈ సినిమాకి ప‌వ‌నే అన్నీ తానై వ్య‌వ‌హ‌రించ‌డంతో సినిమాపై అంచ‌నాలు విప‌రీతంగా పెరిగిపోయాయి.తెలుగులో సుమారు 1400కు పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వ‌డంతోపాటు హిందీలో రికార్డు స్థాయిలో 800 థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుండ‌టంతో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు స‌ర్దార్ ఎంత వ‌సూలు చేస్తుంది…బాహుబ‌లి రికార్డులు క్రాస్ చేస్తుందా చేయ‌దా అనే దానిపై ట్రేడ్ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. అయితే టాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాసిన బాహుబ‌లి.. మొత్తం 600 కోట్లు క‌లెక్టు చేసింది. బాహుబ‌లి త‌ర్వాత .....