News and Entertainment

సర్ధార్ షాకింగ్ బ్లాక్ మార్కెట్




‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ విడుదలకు ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ‘సర్దార్’ విడుదల కాబోతున్న ధియేటర్ల ఎదుట పవన్ అభిమానుల హంగామా అప్పుడే మొదలై పోయిoది. పవన్ కళ్యాణ్ పెద్దపెద్ద కటౌట్స్ ను ఈ సినిమా విడుదల కాబోతున్న దియేటర్స్ ముందు పెట్టి అప్పుడే ‘సర్దార్‘ విడుదల అయిపోయిందా అన్నంత హంగామా సృష్టిస్తున్నారు పవన్ అభిమానులు.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ విడుదల అవుతున్న రోజు ఏప్రియల్ 8 ఉగాది పండుగ కావడంతో కనీవినీ ఎరుగని స్థాయిలో ఈ సినిమా మొదటి రోజు టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.  చాల ప్రాంతాలలో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఆన్ లైన్ లో ఓపెన్ కావడంతో ప్రారంభించిన కొద్ది సేపటికే ఈ సినిమా మొదటి రోజు టికెట్స్ అన్నీ హాట్ కేక్స్ లా అమ్ముడు పోయాయి. అయితే ఆన్ లైన్ లో టికెట్స్ ముందుగానే కొనుగోలు చేసేసి బ్లాక్ మార్కెట్ చేసేస్తున్న కొందరి భాగోతం కూడా బయటకు వస్తోంది.

ఆన్ లైన్ లో టికెట్ కొనడం  దానితో థియేటర్ దగ్గర ప్రింట్ తీసుకోవడం.. బయట అమ్మేసుకోవడం లాంటి వ్యవహారాలు ‘బాహుబలి’ సినిమా విడుదల రోజున జరిగిన సందర్భాలు తెలిసినవే. ఇక ఇదే ట్రెండ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా మొదటి రోజు విషయంలో కూడ జరగబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘సర్దార్’ మొదటిరోజు మొదటి ఆట టిక్కెట్లు 1000 రూపాయల నుండి 2000 వరకు పలికే ఆస్కారం ఉంది అని అంటున్నారు.  

ముఖ్యంగా ఈసినిమాకు మొదటిరోజు మొదటి ఆటకు సంబంధించి ఈ బ్లాక్ మార్కెట్ దందా హైదరాబాద్ విజయవాడలతో పాటు కోస్తా ప్రాంతానికి చెందిన కొన్ని ప్రముఖ నగరాలలో ఎక్కువగా జరగబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి కొంత నెగిటివ్ టాక్ వస్తున్నా దానితో సంబంధం లేకుండా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈసినిమా పై అభిమానులలో పెరిగి పోతున్న మ్యానియా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.