News and Entertainment

చిరు ‘కత్తిలాంటోడు’ ఫస్ట్ లుక్


మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం కత్తిలాంటోడు ఎట్టకేలకు ఈ నెల 29న మధ్యాహ్నం 1.30 గంటలకు ముహుర్తం షాట్ ను పిక్స్ చేసారు..అయితే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా అబిమానులకు అసలైన పండగా ఆరోజు స్టార్ట్ కాబోతుంది..ఇదిలా ఉంటె ఈ చిత్ర ఫస్ట్ లుక్ అంటూ సోషల్ మీడియా లో ఓ పోస్టర్ హల్చల్ చేస్తుంది..

తమిళ కత్తి పోస్టర్ మాదిరిగానే ఈ పోస్టర్ కూడా క్రియాట్ చేసారు..నిజంగానే ‘కత్తిలాంటోడు’ ఫస్ట్ లుక్ ఇదేనా అనే మాదిరిగా డిజైన్ చేసి నెట్ లో వదిలారు..మరి ఇది నిజంగానే చిత్ర యూనిట్ రిలీజ్ చేసారా..లేక ఫ్యాన్స్ క్రియాట్ చేసి వదిలారా తెలియదు కానీ ఎక్కడ చూసిన ఈ పోస్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు..

ఇక చిత్ర ఈ ముహుర్తపు షాట్ కు కేవలం మెగా ఫ్యామిలీ వారు మాత్రమే హాజరువుతున్నారట..పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ మిగతా మెగా హీరోలు మాత్రమే హాజరువుతున్నారని సమాచారం.. వివి వినాయక్ దర్శకత్వంలో చిరు 150వ చిత్రం తెరకెక్కనుండగా, రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Read More:




loading...