News and Entertainment

చిరు వినాయక్ ని కూడా తప్పించేశాడా



ప్రస్తుతం చిరంజీవి నటించబోతున్న 150వ చిత్రం పై షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న వినాయక్ పై కొంత గోప్యతతో కూడుకున్న సమాచారం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇప్పటికే చిరంజీవి తన 150వ చిత్రాన్ని స్టార్ట్ చేయాల్సి ఉండగా, తనకి జరిగిన సర్జరీ, ఆ తరువాత శ్రీజ పెళ్లి కారణంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. 



ఈ లోపు వినాయక్ ఈ మూవీకి సంబంధించిన పనులను ఓ కొలిక్కి తీసుకువస్తున్నాడు. అయితే ఇప్పుడు మెగా స్టార్ 150 మూవీలో భారీ మార్పులు జరిగాయని అంటున్నారు. ఏప్రిల్లో ముహుర్తం పెట్టుకోవాల్సి ఈ మూవీ, ఇంకొంత సమయం పట్టేలా ఉందని అంటున్నారు. ఇందుకు కారణంగా ఈ మూవీ నుండి డైరెక్టర్ వినాయక్ బయటకు వెళ్లాడని అంటున్నారు.



ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తలను మెగాటీం చాలా సీక్రెట్ గా మెయింటెన్ చేస్తుందని అంటున్నారు. రామ్ చరణ్ లైకా ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై వినిపిస్తున్న ఈ న్యూస్ ఎంత వరకూ నిజం అనేది తెలియాలంటే కొంత సమయం వరకూ వేచి ఉండాల్సిందే అని అంటున్నారు.